బిగ్‌స్క్రీన్‌పై డిజాస్టర్.. ఓటీటీలో చావు కబురు చల్లగా సూపర్ హిట్..
టాలెంటెడ్ హీరో కార్తికేయ కెరీర్ మొదటి నుంచి రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ ఫార్మాట్ లోనే కథలను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాకపోయినా కూడా నటుడిగా కార్తికేయ రేంజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక ఈ యువ హీరో రొటీన్ స్టైల్ కు భిన్నంగా ట్రై చేసిన చావు కబురు చల్లగా సినిమా మార్చి 19న థియేటర్స్ లో విడుదలైంది.
ప్రియుడిని వదిలేసి.. పెంపుడు కుక్కతో రోడ్డెక్కిన హాట్ బ్యూటీ మలైకా అరోరా
లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కౌశిక్ డైరెక్ట్ చేయగా బన్నీ వాసు నిర్మించారు. సినిమా విడుదలైన రోజు అయితే ఓ వర్గం నుంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక కొంత నెగిటివ్ టాక్ రావడం అలాగే కోవిడ్ పరిస్థితులు కూడా సినిమాను దెబ్బ కొట్టాయి. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. గీత ఆర్ట్స్ సంయుక్త బ్యానర్ GA2 నుంచి వచ్చిన ఈ సినిమా భారీగా నష్టాలని మిగిల్చింది. 13.5కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 3.32కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. దాదాపు 10కోట్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఓటీటీలో మాత్రం సినిమా బాక్సాఫీస్ రేంజ్ లో హిట్టవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఇటీవల ఎడిట్ చేసి రిలీజ్ చేయగా ఆహా యాప్ లో అత్యధిక వేగంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకున్నట్లు ఆహా యాప్ వాళ్ళు స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అంటే సినిమా జనాలకు ఎంతలా కనెక్ట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనసరం లేదు. ఈ రిజల్ట్ తో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. అద్భుతంగా ఎడిట్ చేసినట్లు బిగ్ స్క్రీన్ పై చూసినవాళ్ళు కూడా మరోసారి చూసి పాజిటివ్ కామెంట్ చేస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











