Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చావు కబురు చల్లగా రిలీజ్ డేట్ ఫిక్స్.. కార్తికేయ, లావణ్య ఫన్నీ పోస్టర్
ఈ రోజుల్లో ఓ వర్గం యువ హీరో హీరోయిన్స్ ఫెయిల్యూర్స్ అందుకోగానే చాలా తొందరగా ఫేడౌట్ అవుతున్నారు. కానీ లావణ్య త్రిపాఠి మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబందం లేకుండా ఛాన్స్ లు అందుకుంటోంది. అయితే అందంతో నటనలో ఈ హీరోయిన్ కు మంచి మార్కులే పడుతున్నాయి గాని బాక్సాఫీస్ వద్ద సరైన హిట్స్ మాత్రం పడటం లేదు. ఇక ఈ సారి 'చావు కబురు చల్లగా సినిమాతో' హిట్ కొట్టేలా ఉందని అనిపిస్తోంది.
మొత్తానికి ఆ సినిమా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు.లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనంతరం ఆమె చేసిన కొన్ని సినిమాలు అప్పుడప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా అందుకున్నాయి. అయితే బ్యాక్ టూ బ్యాక్ కొన్ని డిజాస్టర్స్ రావడం అమ్మడి కెరీర్ ను కొంచెం డౌన్ అయ్యేలా చేశాయి. ఇక ఇప్పుడు ఆమె ఆశలన్నీ ' చావు కబురు చల్లగా' అనే సినిమాపైనే పెట్టుకుంది.
మార్చ్ 19న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఒక ఫన్నీ పోస్టర్ ద్వారా తెలియజేశారు. అందులో హీరో కార్తికేయ బైక్ ముందు భాగంపై కూర్చొని ఉండగా లావణ్య త్రిపాఠి వెనకాల నవ్వుతూ కూర్చొని ఉంది. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమా పెద్దగా పోటీ లేని సమయంలోనే రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరి స్టార్స్ కు కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. మరి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.