Don't Miss!
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చావు కబురు చల్లగా ట్విట్టర్ రివ్యూ: షాకిస్తోన్న ప్రీమియర్ రిపోర్ట్స్.. ఊహించని విధంగా క్లైమాక్స్!
'RX100' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడు టాలెంటెడ్ గాయ్ కార్తికేయ. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపుతూ సత్తా చాటుతున్నాడు. అయితే, భారీ విజయాన్ని మాత్రం ఇప్పటికీ అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి సమయంలో 'చావు కబురు చల్లగా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడి రిపోర్టులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ మీకోసం!
చావు కబురు చల్లగా చెప్పేందుకు రెడీ
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ - సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా'. ఈ చిత్రంతో పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించాడు. ఆమని కీలక పాత్రను పోషించగా, హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. జాక్స్ బిజాయ్ సంగీతం అందించారు.
పెరిగిన అంచనాలు... బిజినెస్ భారీగా
పోస్టర్లు, టీజర్, ట్రైలర్ కారణంగా 'చావు కబురు చల్లగా' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. అయిదు ఆరు కోట్లకు అటు ఇటుగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 13 కోట్ల రూపాయలను చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.13.5 కోట్లకు మించి వసూళ్లు రాబట్టాల్సి ఉంది.
కెరీర్లోనే గ్రాండ్ రిలీజ్... ప్రీమియర్ షో
కార్తికేయ కెరీర్లోనే భారీ చిత్రంగా 'చావు కబురు చల్లగా'ను చెప్పుకోవచ్చు. అందుకే అన్నీ గ్రాండ్‌గా ఉన్నాయి. 19వ తేదీన కూడా సినిమా భారీగానే విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలోనే యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. దాదాపు 20 లొకేషన్లలో ఇప్పటికే సినిమా పూర్తయిపోయింది. దీంతో ఇప్పుడిప్పుడే ట్విట్టర్ వేదికగా సినిమా రివ్యూలు వస్తున్నాయి.
నేచురల్ యాక్టింగ్.. డీ గ్లామర్ రోల్‌తో
'చావు కబురు చల్లగా' గురించి మాట్లాడే వాళ్లంతా ముందుగా బస్తీ బాలరాజుగా నటించిన కార్తికేయ గురించే చెబుతున్నారు. అతడి యాక్టింగ్ ఎంతగానో ఆకట్టుకుందని చెబుతున్నారు. చాలా సన్నివేశాల్లో సహజసిద్ధమైన నటనతో ఎంతో పరిణితితో నటించాడని అంటున్నారు. ఇక, డీ గ్లామర్ రోల్లో నటించిన లావణ్య త్రిపాఠి తనలోని మరో యాంగిల్‌ను అద్భుతంగా చూపించిందట.
సినిమాలో ప్లస్‌లు.... మైనస్‌లు ఇవే
'చావు కబురు చల్లగా'లో చాలా అంశాలు ఆకట్టుకున్నాయని.. కొన్ని మాత్రం నిరాశ పరిచాయని అంటున్నారు ప్రేక్షకులు. ఇందులో కార్తికేయ, లావణ్య నటనతో పాటు అనసూయ ఐటమ్ సాంగ్ బాగుందని చెబుతున్నారు. అలాగే, ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయట. కానీ, నవ్వు తెప్పించని కామెడీ, స్క్రీన్‌ప్లే పేలవంగా ఉండడంతో సినిమా చాలా చోట్ల బోరింగ్‌గా ఉంటుందని టాక్.
‘చావు కబురు చల్లగా’ ట్విట్టర్ రివ్యూ
'చావు కబురు చల్లగా' మూవీని ప్రీమియర్ షో చూసిన వాళ్లంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఫస్టాఫ్ సోసోగా నడిచిందని, సెకెండాఫ్ మాత్రం ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా ఉందని చెబుతున్నారు. క్లైమాక్స్ సీన్ మాత్రం ఊహించని విధంగా ఉందంటున్నారు. మొత్తంగా ఈ సినిమాను ఒకసారి చూడొచ్చని సినిమాను వీక్షించిన వాళ్లంతా అంటున్నారు.
షాకిస్తోన్న సినిమా ప్రీమియర్ రిపోర్ట్స్
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'చావు కబురు చల్లగా' ప్రీమియర్ రిపోర్టులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు వెల్లడిస్తున్న వారిలో చాలా మంది ఈ సినిమా గురించి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగే నేచురల్ స్టోరీ అని కొందరు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే కొందరు మాత్రం పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.