పూరీ జగన్నాథ్ తన తమ్ముడు సాయి రామ్ శంకర్ తో చేయబోయే చిత్రం ఓ హీలీవుడ్ సినిమాకి ఫ్రీ మేక్ అని పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. అది 'జస్ట్ లైక్ హెవెన్' అనే 2005 లో వచ్చిన సినిమాట. దాన్ని హిందీలో 'ఐ సీ యు' పేరిట ఫ్రీమేక్ చేసారు. కాని వర్కవుట్ కాలేదు. ఇప్పుడు దాన్ని సంస్కరించి తెలుగుకి పనికొచ్చేలా మార్చటానికి కుస్తీ జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆ సినిమా ఓ యాక్సెడెంట్ లో కోమాలోకి వెళ్ళిపోయిన అమ్మాయి ప్రేమ కథ. ఆ అమ్మాయి శరీరం నుండి విడివడిన ఆత్మకీ, ఓ కుర్రాడికీ మధ్య జరిగే రొమాంటిక్ కామిడి. ఈ ఫ్రీమేక్ వార్త నిజమైతే చాలా సున్నితమైన ఈ సబ్జెక్ట్ ని పూరీ డీల్ చేస్తాడో చూడాలంటున్నారు. అయినా ఫ్రీ మేకా కాపీనా ప్రక్కన పెడితే పాపం ఇప్పటికైనా సాయి రామ్ కి హిట్టు వస్తే బాగుండునని అందరూ ఆశిస్తున్నారు. అప్పటికి అందరి హీరోలు లాగానే అతను కూడా సిక్స్ ప్యాక్ బాడి కూడా పెంచాడుట.