'రోబో' దొరక్కపోతేనేం...సెక్స్ బాంబ్ ని పట్టుకున్నాం

By Srikanya

వివాదం పరిష్కారమవుతుందన్న నమ్మకంతోనే ఇంతవరకూ ఓపిక పట్టానని, సన్ పిక్చర్స్ అధినేతలు తప్పు మీద తప్పు చేస్తూ పోతుంటే చూస్తూ ఊరుకోలేనని, ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని రోబో నిర్మాతల మీద ఛాలెంజ్ చేసిన నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు గుర్తుండే ఉంటారు. ఆ తర్వాత ఆయన ఆ విషయాన్ని ఏం చేసారో తెలియదు కానీ...తాజాగా సెక్స్ బాంబ్ మల్లికా శెరావత్ నటించిన తాజా చిత్రం 'హిస్' దక్షిణాది రైట్స్ ని సొంతం చేసుకున్నారు. 'హిస్' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబరు 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది.

పగ తీర్చుకునే నాగిని పాత్రలో మల్లిక ఈ చిత్రంలో నటించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రానికి హాలివుడు టెక్నీషియన్లు పనిచేయడం విశేషం. అలాగే రెగ్యులర్ గానే కాస్త బట్టలు తక్కువ ధరించే మల్లిక ఈ చిత్రంలో కాస్త ముందుకు పోయి నగ్నంగా కూడా నటించినట్లు వినికిడి. ఇక ఈ చిత్రంలో మల్లిక పాత్ర...నొ డైలాగ్స్...ఓన్లీ ఏక్షన్ అనే స్కీమ్ ఫాలో అవుతుంది. ఈ విషయాన్ని దర్శకురాలు జెన్నిఫర్ లిచ్ చెప్తూ...స్నేక్ ఉమెన్ గా చేస్తున్న ఈ చిత్రంలో ఆమెకు డైలాగులు అసలు లేవు. ఈ సినిమాలో ఆమె పగ తీర్చుకునే నాగిని గా చేస్తోంది...అయినా పాములు రెగ్యులర్ గా మాట్లాడవు కదా...అనే ఈ రకంగా ఏర్పాటు చేసానంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X