»   » 'రోబో' తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న నిర్మాత

'రోబో' తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజనీకాంత్, శంకర్ కలయికలో వస్తున్న 'రోబో' మరో రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ ‌లో ఈ సినిమా డబ్బింగ్ హక్కులు రూ.30 కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు సినీ చరిత్రలో ఓ డబ్బింగ్ సినిమాకు గతంలో ఎన్నడూ లేనంత ధర పలికింది 'రోబో'కే కావటం గమనార్హం. ప్రముఖ పంపిణీ సంస్థ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిల్మ్స్ అధినేత చదలవాడ శ్రీనివాసరావు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు..ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..."దర్శకుడు శంకర్‌పై నమ్మకముంది. అంతేకాదు...రజనీ, ఐశ్వర్య రాయ్, శంకర్‌ లు సినీ లోకంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. శంకర్ తీసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఆ నమ్మకంతోనే 'రోబో'ను కొన్నాను" అన్నారు.

అలాగే రాష్ట్రంలో 500 నుంచి 600 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నామని, మొదటి వారంలోనే పెట్టుబడులు తిరిగి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలైన మొదటి వారంలోనే భారీగా వసూళ్లు ఉంటాయని భావిస్తున్నందున పైరసీ ప్రమాదం ఉండకపోవచ్చునని అన్నారు. ఇక ఈ చిత్రం తెలుగు అనువాద హక్కుల కోసం తెలుగు చిత్ర రంగానికి చెందిన ముగ్గురు నిర్మాతలు పోటీ పడ్డారు. బెల్లంకొండ సురేష్ రూ.20 కోట్లు చెల్లించేందుకు ముందుకు రాగా, మరో ఇద్దరు ప్రముఖ నిర్మాతలు రూ.23 కోట్లు, రూ.26 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలిసింది.అయితే, రూ.30 కోట్ల కు పైసా కూడా తగ్గేది లేదని ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ స్పష్టం చేసారు. ఈ సినిమా వచ్చే నెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu