Record Break 480 మంది కోసం కోట్లు దానం చేశాడు.. సోషల్ మెసేజ్‌తో రికార్డు బ్రేక్
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ పద్మావతి నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్న చిత్రం రికార్డ్ బ్రేక్. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ నటి జయసుధ కుమారుడు నిహర్ కపూర్, తెలుగు సినిమాకు పరిచయం అవుతున్న నాగార్జున కలిసి నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో రగ్ద ఇఫ్తాకర్, సత్యకృష్ణన్, సోనియా తదితరులు నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పూరి, బెంగాలీ మరియు ఒడియాలో నిర్మించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల జరిగింది? ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ..
ఇద్దరు అనాథలైన యువకులు దేశానికి ఎలా గర్వకారణమయ్యారనే పాయింట్‌తో రికార్డు బ్రేక్ సినిమా రూపొందింది. అయితే అంతర్లీనంగా ఈ సినిమాలో భావోద్వేగానికి గురిచేసే ఓ ఎమోషనల్ పాయింట్ ఉంది. సినిమా రిలీజ్ తర్వాత ఆ పాయింట్ గురించి అందరూ చర్చించుకొంటారు అని డైరెక్టర్ అజయ్ అన్నారు.

చదలవాడు శ్రీనివాసరావు నిర్మాతగా జీవిత ఖైదీ అనే సినిమా చేశారు. మాతృదేవోభవ సినిమాను మనీషా కోయిరాలతో తులసి అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. ఆర్ నారాయణమూర్తితో ఏ ధర్తి హమారీ సినిమాను నిర్మించారు. బిచ్చగాడు లాంటి భారీ హిట్‌ను అందించారు. ఆయన తన జీవితంలో ఎన్నో సామాజిక సేవలు అందించారు. చిత్రపురిలో 480 మందికి కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకొన్నారు. రికార్డుబ్రేక్ ద్వారా కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు అని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్నకుమార్ అన్నారు.
నందమూరి తారక రామారావు నటించిన వేటగాడు, అడవి రాముడు, అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు ఇలాంటి సినిమాల స్పూర్తితో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో రికార్డ్ బ్రేక్ సినిమాను రూపొందించాం. చివరి 45 నిమిషాలు చాలా భావోద్వేగానికి గురిచేస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నాం. నటుడు చలపతిరావుకు ఇది చివరి చిత్రం అని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు అని అన్నారు.
నటీనటులు: నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణన్, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ తదితరులు
నిర్మాత: చదలవాడ పద్మావతి
స్క్రీన్ ప్లే & దర్శకత్వం : చదలవాడ శ్రీనివాసరావు
కథ: అంజిరెడ్డి శ్రీనివాస్
మ్యూజిక్: సాబు వర్గీస్
ఎడిటింగ్: వెలగపూడి రామారావు
సినిమాటోగ్రఫి: కంతేటి శంకర్
కో-డైరెక్టర్లు: కూరపాటి రామారావు, గోలి వెంకటేశ్వరులు
బ్యానర్: చదలవాడ బ్రదర్స్


Click it and Unblock the Notifications











