‘ఓ మై ఫ్రెండ్’ సినిమా పాటకు మరో దర్శకుడు

By Bojja Kumar

siddharth
సిద్దార్ద, శృతిహాసన్ జోడీగా వస్తున్న తాజా చిత్రం 'ఓ మై ఫ్రెండ్". వేణు శ్రీరామ్ దర్శకుడు. అయితే ఈ సినిమాలోని కొన్ని పాటలకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో 'బాణం" సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా అసలు దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాకు సంబంధించిన ఇతర వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో చైతన్య దంతులూరి ఈ బాధ్యతలను భుజాలపైకి ఎత్తుకున్నారు. మరి చైతన్య సాంగ్ డైరెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో..సినిమా విడుదలైతే గానీ తెలీదు.

నవదీప్, హన్సికలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీశ్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్ధార్థ- దిల్ రాజు కాంబినేషన్ లో గతంలో వచ్చిన బొమ్మరిల్లు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నవంబర్ 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బొమ్మరిల్లు త్వరాత సరైన హిట్ లేని సిద్ధార్ధ ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X