నాగార్జున కుమారుడు నాగచైతన్య హీరోగా తెరంగ్రేటంకు అన్నివిధాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అతని సరసన హీరోయిన్ గా శ్రధ్ద కపూర్ ని ఎంపికచేసారు. ఆమె మరెవరో కాదు. బాలీవుడ్ లో విలన్ పాత్రలు,కామిడీ రోల్స్ వేసే శక్తి కపూర్ కూతరు. ఆమెకు కూడా ఇదే మొదటి సినిమా. బోస్టన్ లో చదువుకున్న ఈ కపూర్ల అమ్మాయి పోర్ట్ ఫోలియో చూసిన నాగార్జున పూర్తి స్ధాయిలో ఇంప్రెస్ అయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను తమ సినిమాలోకి తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాని దిల్ రాజు బ్యానర్ లో వాసువర్మ దర్సకత్వంలో చేస్తున్నారు. చైతన్య తాతగారైన అక్కినేని నాగేశ్వరావు పుట్టిన రోజు (సెప్టెంబర్ 20)న ఈ సినిమాని లాంచ్ చేయనున్నారు. బాలీవుడ్,టాలీవుడ్ సినీ పెద్దలను తన కుమారుడుని ఆశ్వీదరించటానికి నాగార్జున పిలవాలని ప్లాన్ చేస్తున్నారు.సందీప్ చౌతా సంగతం అందిస్తున్నాడు.ఇక శ్రధ్ధ తీన్ పత్తి అనే హిందీ సినిమాకు కమిట్ అయ్యిందని తెలుస్తోంది. ఇందులో అమితాబ్ ప్రధాన పాత్ర చేస్తున్నారు.