For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెడ్‌కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు

    |

    మెగా డాటర్ నిహారిక ఇప్పుడు అత్తింటివారిలో మహారాణిలో తిరుగుతోంది. ఇంట్లో కంటే ఎక్కువగా ఫ్రీడం ఉందని, ఎంతో బాగా చూసుకుంటున్నారని నిహారిక చెప్పుకొచ్చింది. ఇంట్లో అయినా కనీసం నిద్రలేవని అంటారని, కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరూ కూడా అలా అనడం లేదని, ఎంత సేపు పడుకున్నా కూడా ఏమీ అనడం లేదని నిహారిక చెప్పుకొచ్చింది. ఆకలేస్తుందని అంటే అత్తగారే కలిపి నోట్లో ముద్దలుపెడుతోందని నిహారిక అత్తింటి విషయాలను బయటకు చెప్పేసింది.

    అలా అన్నారట..

    అలా అన్నారట..

    మా అబ్బాయిని నువ్ బాగా చూసుకో.. మేము నిన్ను బాగా చూసుకుంటామని నిహారికతో తన అత్తమామలు అన్నారట. అలా అయితే ఇంకా మంచిదే అనుకుందట. అలా మొత్తానికి అత్తింట్లో మహారాణి యోగాన్ని నిహారిక అనుభవిస్తోంది. ఆ మధ్య ఓ మీడియాతో మాట్లాడుతూ పెళ్లి తరువాత జీవితం గురించి ఎన్నో విషయాలను చెప్పేసింది.

    చిన్న చిన్న గొడవలు..

    చిన్న చిన్న గొడవలు..

    చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. నేను ఎక్కువగా అరుస్తుంటాను.. కానీ ముందు సారీ చెప్పేది మాత్రం ఆయనే.. సారీ చెప్పేలా నేను చేస్తాను అంటూ నిహారిక తన గడుసుదనం గురించి చెప్పేసింది. ఇద్దరిలోనూ తనకే కోపం ఎక్కువ అని చెప్పుకొచ్చింది.

    నిబంధనలేమీ లేవు..

    నిబంధనలేమీ లేవు..

    పెళ్లి తరువాత సినిమాల్లో నటించడంపై ఎవ్వరూ కూడా ఎలాంటి నియమాలు పెట్టలేదు. పుట్టింటి వారి నుంచి కానీ అత్తింటి వారి నుంచి కానీ ఎలాంటి కండీషన్స్ లేవు.. నాకు ఇష్టమైన పని చేసే స్వేచ్చను ఇచ్చారంటూ నిహారిక తెలిపింది. ప్రస్తుతానికి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నానని తెలిపింది.

     షూటింగ్‌లో గాయం..

    షూటింగ్‌లో గాయం..

    అయితే ప్రస్తుతం నిహారిక పగలు రాత్రి అని తేడా లేకుండా ఆ వెబ్ సిరీస్ షూటింగ్‌తో బిజీగా ఉంటోంది. తాజాగా నిహారిక కాలికి గాయమైనట్టు కనిపిస్తోంది. ఈ మేరకు నిహారిక చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉన్న ఫోటోను షేర్ చేసింది నిహారిక.

    బుజ్జగిస్తున్నాడట..

    బుజ్జగిస్తున్నాడట..

    అయితే భార్యకు అలా గాయమైన బెడ్ మీద ఉండటంతో చైతన్య సేవలు చేస్తున్నట్టు తెలుస్తోంది. బ్రోకెన్ వైఫ్‌ను పాంపర్ చేస్తున్నాడంటూ నిహారిక ఓ ఫోటోను షేర్ చేసింది. నిహారిక కాలికి పెద్ద పట్టీ వేసి ఉండటం చూస్తుంటే.. పెద్ద గాయమే అయినట్టు కనిపిస్తోంది.

    English summary
    Chaitanya JV Pampers Niharika On Leg Injury,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X