Just In
- 41 min ago
దానికి రెడీ అంటూ అలీకి షాకిచ్చిన షకీలా: తెలుగు డైరెక్టర్ ఫోన్.. మోసం చేసింది ఆయనంటూ లీక్ చేసింది
- 1 hr ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 1 hr ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 2 hrs ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
Don't Miss!
- News
Paul Dhinakaran జీసస్ కాల్స్ సంస్థలపై ఐటీ దాడులు .. ఎన్నికలకు ముందే..!
- Finance
41 కోట్ల జన్ ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ 7.5%
- Sports
'సిరాజ్ భాయ్.. ఇంత మెరుగ్గా బౌలింగ్ చేస్తాడని ఊహించలేదు'
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఆటోనగర్ సూర్య' విడుదల ఖరారు (అఫీషియల్)
ఈ విషయమై అచ్చి రెడ్డి మాట్లాడుతూ..." కేవలం రెండు పాటలు, కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. ఒక పాటను మలేషియాలో చిత్రీకరిస్తున్నాం. దీపావళి కి ఈ సినిమాని రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. ," అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దేవాకట్ట.... తన ట్విట్టర్లో చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం విషయంలో అంతరాయం తలెత్తిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని త్వరలోనే అన్ని పూర్తి చేసి రిలీజ్ చేస్తానని ట్విట్టర్ ద్వారా ఆయన పేర్కొన్నారు. దాదాపు ఈ చిత్రం షూటింగ్ పూర్తిగావచ్చిందని, మిగిలిన భాగాన్ని పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తామని దేవా కట్టా ట్విట్టర్‌లో తెలిపారు.
ఈ చిత్రంలో స్టోరీ లైన్ ఏమిటంటే... విజయవాడలో బెంజ్ సర్కిల్ ఎంత ఫేమసో... ఆటోనగర్ సూర్య కూడా అంతే. తనకు తెలిసిన పని చేసుకొంటూ... ఆ రంగంలో ఎదగాలనుకొనే రకం. ఒకరి హక్కును కబ్జా చేస్తే మాత్రం ఊరుకోడు. అందుకే సూర్య పేరు చెబితే రౌడీమూక గుండెల్లో కంగారు మొదలవుతుంది. ఇలాంటి మనస్తత్వమున్న సూర్య జీవితంలోకి ఎవరెవరు వచ్చారు? అతని ప్రయాణానికి అడ్డుగా నిలిచిన వారికి ఎలా బుద్ధిచెప్పాడు? తదితర విషయాలు 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో చూపించబోతున్నారు.
ఆటో నగర్ సూర్య చిత్రంలో సమంత హీరోయిన్. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ నేపథ్యంలో ప్రేమ, వినోదాంశాలు కలగలిపి ఈ చిత్రం రూపొందుతోంది. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం: అనూప్‌రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.