‘చక్కిలిగంత’ టీజర్ విడుదల చేసారు (వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: అంతకు ముందు ఆ తర్వాత, లవర్స్ చిత్రాల విజయవాల తర్వాత సుమంత్ అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం ‘చక్కిలిగింత'. రెహనా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇలవల ఫిలింస్ సమర్పణలో మహిస్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై సి.హెచ్.నరసింహారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం సారథి స్టూడియోలో ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. సుమంత్ అశ్విన్, రెహానాలు టీజర్ విడుదల చేసారు.

 Chakkiligintha teaser launch

ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలోని పాటలు ఈ నెల 15న విడుదల కానున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ...‘ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌కు విశేష స్పందన లభించింది. చక్కిలిగింతలు పెట్టే అందమైన ప్రేమకథతో దర్శకుడు వేమారెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు' అన్నారు.

ఈ చిత్రానికి మిక్కీ జే.మేయర్ అందించిన సంగీతం హైలెట్ అవుతుంది. ఈ నెల 15న ఆడియోను విడుదల చేస్తున్నాం. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు నిర్మాత.

సినిమా గురించి దర్శకుడు వేమారెడ్డి మాట్లాడుతూ...ఇదొక సరికొత్త ప్రేమకథ. కొత్తదనం కోరుకునే వారికి తప్పకుండా నచ్చుతుందని తెలిపారు. సుమంత్ అశ్విన్, తాగుబోతు రమేష్, వివా హర్ష, తులసి, అంబటి శ్రీను, జోష్ రవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ - సాయి శ్రీరామ్, ఎడిటింగ్ - కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ - ఏ.యస్.ప్రకాష్, పి.ఆర్.ఓ - మధు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - అయ్యప్ప, రచనా సహకారం - టి.మధుసూదన్, జయంత్, నిర్మాతలు - సి.హెచ్.నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవాలా, కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం - టి.వేమారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X