twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చక్రి మెగా మ్యూజికల్ షో డిటేల్స్

    By Srikanya
    |

    ప్రముఖ సంగీత దర్సకుడు చక్రి మే నెల 26న ఓ సంగీత విభావరిని నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని మీడియాకు తెలియచేస్తూ హైదరాబాద్ లో ఓ సమావేశం నిర్వహించారు. అందులో చక్రి మాట్లాడుతూ...సినిమా సంగీతాన్ని నమ్ముకొన్న కళాకారులు చాలామంది పేదరికంలో ఉన్నారు. వారికి చేయూతనందిచడమే మా లక్ష్యం అన్నారు. చక్రి ప్రస్తుతం సినీ మ్యుజిషియన్‌ యూనియన్‌ అధ్యక్షుడు.

    అలాగే చిత్ర పరిశ్రమలో రాణించేందుకు ఎంతోమంది కళాకారులు ఎదురు చూస్తున్నారు. కానీ సరైన అవకాశాలు దొరకడం లేదు. వృద్ధ కళాకారులు ఎంతోమంది కష్టాలు పడుతున్నారు. వారందరికీ ఆర్థికంగా చేయూతనందించడమే లక్ష్యంగా మెగా మ్యూజికల్‌ షో పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సంగీత దర్శకులు, గాయనీగాయకులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం ఇందుకు వేదిక. చిత్ర పరిశ్రమ నుంచి కూడా చక్కటి ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు.

    ఇదే సమావేశంలో నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ''మన చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కి తరలివచ్చి చాలా సంవత్సరాలైంది. సంగీతంపరంగా మన పనులన్నీ ఇక్కడే జరిగేలా అభివృద్ధి సాధించాలి. ఒక సదుద్దేశంతో కూడుకొన్న కార్యక్రమం ఇది. అందరం సహకరిస్తామని''అన్నారు. ఈ సమావేశంలో ఆర్‌.పి.పట్నాయక్‌, హేమంత్‌కుమార్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు.

    ఇక చక్రి రీసెంట్ గా సంగీతం అందించిన చిత్రం నా ఇష్టం. ప్రకాష్ తోలేపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. అలాగే మంచు విష్ణు వర్ధన్ హీరోగా రూపొందుతున్న దొరకడు చిత్రానికి సైతం చక్రిని సంగీతం అందిస్తున్నారు. మరెన్ని చిన్న చిత్రాలకు సైతం చక్రి రీసెంట్ గా కమిటయ్యారని సమాచారం.

    English summary
    The Cine Musician Union has going to organise a Mega Musical Show on May 26 at Lalitha Kala Thoranam in Public Gardens. Speaking to reporters the union president and music director Chakri said that there are hundreds of music artists in the state who wants to provide music to the films but could not get chance due to various reasons. Some of the musicians are starving to death and facing lot of financial problems. To solve their problems these show has been organised, whatever amount comes from these show will be given to poor and needy musicians of the film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X