మనిద్దరం కలిసి మళ్లీ పనిచేస్తున్నాం అని బాలకృష్ణ అన్నారు
ఈ మధ్యకాలంలో నాకు పెద్ద విజయం 'సింహా". బాలకృష్ణగారితో తొలిసారి పనిచేశాను. ఎప్పడు కనిపించినా ఆయన 'సింహా" గురించే మాట్లాడతారు. ఇటీవలే బాలకృష్ణగారి పుట్టినరోజు వెళ్లి కలిశాను. 'మనిద్దరం కలిసి మళ్లీ పనిచేస్తున్నాం" అన్నారు. చాలా ఆనందం అనిపించింది అంటూ చెప్పుకొచ్చారు చక్రి. 'సింహా" సినమా ఘన విజయంలో ఆడియోకు షేర్ ఉంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అందుకే బాలకృష్ణ మరోసారి ఆఫర్ ఇవ్వటానకి రెడీ అయ్యారు. ఇక చక్రికి తెలుగులో ఇప్పటిదాకా చేసిన వారితో కాక మిగతా వారితో కూడా చేయాలని ఉందని అంటూ...తెలుగులో ఇంకా వెంకటేష్, మహేష్, చరణ్ లకు కూడా సంగీతం అందించాలని ఉంది. ఆ కోరిక త్వరలోనే తీరుతుందనుకుంటున్నాను అన్నారు. ప్రస్తుతం చక్రి రానా 'నా ఇష్టం", వైవీఎస్ చౌదరి 'రేయ్", శ్రీకాంత్, తరుణ్‌ల 'అనుచరుడు", నిఖిల్ 'వీడు తేడా", తరుణ్ 'యుద్ధం" సినిమాలతో పాటు, జగపతి బాబు నటించనున్న ఓ సినిమా కూడా చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











