twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు బొమ్మాలీ డైలాగ్‌తో రవిశంకర్ దడ.. ఇప్పుడు రాజరథంలో సెన్సేషన్!

    By Rajababu
    |

    'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసే వారి ఆకట్టుకునే నైపుణ్యం తో, ఉన్నత ప్రమాణాలతో ఆకర్షిస్తున్న 'రాజరథం' ఈ పాటతో మరోసారి ఆశ్చర్యపరచనుంది. ఎన్నో సినిమాలకి, ఎంతో మందికి డబ్బింగ్ చెప్పిన ప్రముఖ నటుడు రవి శంకర్ మొట్ట మొదటి సారి 'రాజరథం' లో తాను పోషిస్తున్న 'అంకుల్' పాత్ర కోసం 'చల్ చల్ గుర్రం' పాట పాడారు.

    చల్ చల్ గుర్రం అనే పాటను మహాబలేశ్వర్, పూణే లో ని మాల్షెజ్ ఘాట్ లాంటి అందమైన ప్రదేశాలలో కనువిందుగా చిత్రీకరించారు. దర్శకుడు అనూప్ భండారి సహజమైన మంచు కోసం మాల్షెజ్ ఘాట్ ని ఎంచుకున్నారు. ఒకోసారి మంచు తీవ్రత తగ్గేవరకూ ఆగి షూటింగ్ చేసుకోవాల్సి వచ్చేది. 'రాజరథం' కోసం దిలీప్ రాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేసి తయారు చేసిన పాతకాలపు సైడ్ కార్ ఉండే స్కూటర్ ఈ పాటకి అదనపు ఆకర్షణ. ఈ స్కూటర్ మనల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడం ఖాయం.

    Chal Chal Gurram from 'Rajaratham' is a tongue-twister for sure!

    ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటల ట్యూన్లతో సరిపోయేలా ఉండే ఈ 'చల్ చల్ గుర్రం' సాహిత్యంలో చాల అరుదైన తెలుగు పదాలని సినిమా కథకి సరిపోయేలా ఉపయోగించారు. రామజోగయ్య శాస్త్రి గారి పదాల అల్లిక, అనూప్ భండారి స్వరపరిచిన బాణీ వలన ఈ పాట వీనుల విందుగా ఉంటూ సాహిత్య పరంగా ప్రత్యేకత ని చాటుకుంది.

    Chal Chal Gurram from 'Rajaratham' is a tongue-twister for sure!

    నృత్య దర్శకులు బోస్కో - సీజర్ పర్యవేక్షణలో కనువిందు చేసేలా రూపొందిన ఈ పాటలో స్థానిక పల్లెజనాలు కూడా పాలుపంచుకున్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి, ఆర్య ప్రధాన పాత్రల్లో నటించి, అనూప్ భండారి దర్శకత్వంలో, 'జాలీ హిట్స్' నిర్మాణంలో తెరకెక్కిన 'రాజరథం' ప్రపంచవ్యాప్తంగా మార్చ్ 23 న విడుదల కానుంది.

    English summary
    Rajaratham” album is going to strike a hat-trick with their 3rd single 'Chal Chal Gurram'. This movie promises to bring the hidden talents of the crew. This time it’s Ravi Shankar who is wearing the singing hat. He would be seen crooning for his own character - Uncle. Shot in the picturesque of Mahabaleshwar and Malshej ghat in Pune director Anup Bhandari chose this location as he wanted natural fog and mist effect. However, "the fog would sometimes be so thick that the team had to wait for it to get cleared before resuming the shoot" said Anup.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X