మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

Recommended Video

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న ఛల్ మోహన్ రంగ చిత్రం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇటీవల విడుదలైన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నారు. కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది.

నితిన్ ని బెదరగొడుతున్న మేఘ

నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో మేఘ ఆకాష్ పేరు మేఘ సుబ్రహ్మణ్యం. మీ పేరేంటండి అని నితిన్ అడగగా.. మేఘ.. మేఘ సుబ్రహ్మణ్యం అని బదులు ఇస్తుంది. మేగా గారు అని నితిన్ తిరిగి పలకరిస్తాడు. మేగ కాదు.. మే.. ఘ.. వత్తు ఘ అని మేఘా ఆకాష్ ఘాటుగా బదులిస్తుంది. ఈ అందమైన సంభాషణతో 'గా ఘ మేఘ' అనే మెలోడీ సాంగ్ మొదలవుతుందన్న మాట.

 అందంగా ఆహ్లాదంగా

అందంగా ఆహ్లాదంగా

ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది.

 మ్యాజిక్ మొదలు పెట్టిన తమన్

మ్యాజిక్ మొదలు పెట్టిన తమన్

ఇటీవల విడుదలైన టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ సంగీతం బావుందని ప్రశంసలు దక్కాయి. తాజగా సాంగ్ లో కూడా సంగీత అద్భుతంగా ఉంది. తమన్ తన మ్యూజిక్ మ్యాజిక్ ని మొదలుపెట్టాడు.

జోరు మామూలుగా లేదు

జోరు మామూలుగా లేదు

సంగీత దర్శకుడు తమన్ జోరు మాములుగా లేదు. తొలిప్రేమ, భాగమతి వంటి విజయాలతో తమన్ దూసుకుపోస్తున్నాడు.

 మరో సూపర్ హిట్ ఆల్బమ్

మరో సూపర్ హిట్ ఆల్బమ్

తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

 రొమాంటిక్ ఎంటర్టైనర్ వేసవిలో

రొమాంటిక్ ఎంటర్టైనర్ వేసవిలో

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం వేసవిలో ఏప్రిల్ 5 న విడుదలకు సిద్ధం అవుతోంది.

 మరోమారు మేఘతో

మరోమారు మేఘతో

లై చిత్రంలో నితిన్, మేఘ జంటగా నటించారు. ఆ చిత్రం నిరాశ పరిచినా ఛల్ మోహన్ రంగ చిత్రంపై అంతటా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X