twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్విట్టర్ రివ్యూ: 'ఛల్ మోహన్ రంగ' అంతా ఫన్, గురూజీ మార్క్‌తో, పవన్‌కి తొలి హిట్.. ఆ ఒక్కటీ తప్ప!

    |

    Recommended Video

    Chal Mohan Ranga Movie Twitter Review 'ఛల్ మోహన్ రంగ' ట్విట్టర్ రివ్యూ

    నితిన్ నటించిన తాజా చిత్రం ఛల్ మోహన్ రంగ చిత్రం నేడు(గురువారం) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరియు నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వంటి పెద్ద పేర్లు ఈ చిత్రంలో ఇన్వాల్వ్ అయి ఉండడంతో మొదటినుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. యూఎస్ లో ఇప్పటికే ప్రదర్శించబడిన షోల నుంచి ఛల్ మోహన్ రంగ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన అభిమానుల స్పందన, సోషల్ మీడియాలో ఈ చిత్రానికి ఎలాంటి టాక్ ఉందొ ఇప్పుడు చూద్దాం.

    ఘనంగా ప్రారంభమైన సమ్మర్

    రంగస్థలం సూపర్ సక్సెస్ తో టాలీవుడ్ కి ఈ వేసవి ఘనంగా ప్రారంభం అయింది. ఇటీవల విడుదలైన రంగస్థలం చిత్రం అద్భుత విజయం సాధించింది. అదే బాటలో నేడు విడుదలైన నితిన్ ఛల్ మోహన్ రంగ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

    ఫస్ట్ హాఫ్‌లో కామెడి హైలైట్

    ఫస్ట్ హాఫ్ లో కామెడీ ప్రధాన బలంగా నిలిచింది. నితిన్, మేఘా ఆకాష్ పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది.

    తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

    తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ కు తమన్ సంగీతం కూడా ప్లస్ పాయింట్.

    టైమ్ పాస్ ఎంటర్‌టైనర్

    సెకండ్ హాఫ్ చిత్రానికి కాపాడింది. కామెడి బావుంది. నితిన్ ఛల్ మోహన్ రంగ ఈ వేసవిలో టైమ్ పాస్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుంది.

    స్మూత్‌గా సాగిపోయింది

    ఛల్ మోహన్ రంగ చిత్ర ఫస్ట్ హాఫ్ స్మూత్ గా సాగిపోయింది. ఫస్ట్ హాఫ్ పరవాలేదు.

    త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్

    ఓవరాల్ గా ఛల్ మోహన్ రంగ చిత్రం బావుంది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. కామెడీ ప్లస్ పాయింట్.

    పవన్‌కు తొలి హిట్

    పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పీకే క్రియేటివ్ వర్క్స్ కు చల్ మోహన్ రంగ చిత్రం తొలి హిట్. అంతటా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

    ఆ ఒక్కటీ మైనస్

    కామెడీ బావుంది. నితిన్ మేఘా మధ్య సన్నివేశాలు బావున్నాయి. కానీ కథ అంత బలమైనది కాకపోవడం ఛల్ మోహన్ రంగ చిత్రంలో మైనస్ పాయింట్.

    యూఎస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్

    యూఎస్ ప్రీమియర్ షోలనుంచి ఛల్ మోహన్ రంగ చిత్రానికి పాజిటివ్రిపోర్ట్స్ వస్తున్నాయి.

    పెద్ద పులి సాంగ్‌లో డాన్స్ అదుర్స్

    తెలంగాణ జానపద గేయం పెద్ద పులి సాంగ్ లో నితన డాన్స్ అదరగొట్టాడు. రొటీన్ చిత్రమే అయినప్పటికీ ఎంటర్ టైనింగ్ గా ఉంది.

    English summary
    Chal Mohan Ranga movie Twitter review. This is Nithin 25 film under Pawan Kalyan and Trivikram production.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X