»   » ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుంటే...ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు: పవన్ కళ్యాణ్

ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుంటే...ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు: పవన్ కళ్యాణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
    Pawan Speaks About His Relationship With Nithin

    నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'ఛల్ మోహ‌న్‌ రంగ‌'. శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఆదివారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నితిన్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

    ఎలాంటి సపోర్టు లేకుంటే బాధ ఎలా ఉంటుందో తెలుసు

    ఎలాంటి సపోర్టు లేకుంటే బాధ ఎలా ఉంటుందో తెలుసు

    ‘ఎలాంటి సపోర్టు లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అలాగే ఒక సినిమా జయం రావడం, అపజయం రావడం ఇదంతా జరిగినపుడు ఆ భావన, భాధ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    అందుకే నితిన్ సినిమాలకు వస్తున్నా

    అందుకే నితిన్ సినిమాలకు వస్తున్నా

    నేను వరుస అపజయాల్లో ఉన్నపుడు నితిన్ వాళ్ల నాన్నగారు నా దగ్గరికి వచ్చి మా ‘ఇష్క్' సినిమా ఆడియో రిలీజ్ చేయాలని అడిగినపుడు నాకు ఒకటి అనిపించింది. ఇది మంచి సెంటిమెంట్ అని నా దగ్గరికి వస్తున్నారు, నేను విజయంలో ఉంటే వేరే సంగతి ... కానీ వారు నా మీద అభిమానంతో మనస్ఫూర్తిగా వచ్చారని అర్థమైంది. ఏ విషయంలో అయినా మనం ఒక ఎమోషనల్ సపోర్టు కోరుకుంటాం... నితిన్‌కు నేను వెళితే బావుంటుంది అనిపించి వెళ్లాను. మీ అందరి సపోర్టు వల్ల ఇష్క్ సినిమా విజయం సాధించింది.... అని పవన్ కళ్యాణ్ తెలిపారు.

    నితిన్‌కు నాకు ఐదారేళ్ల తేడానే

    నితిన్‌కు నాకు ఐదారేళ్ల తేడానే

    కొంద‌రు నా సినిమాలో చూసి ఐఐటీకి వెళ్లిన విద్యార్థులు కూడా ఉన్నారు. జ‌యాల‌కు పొంగ‌కుండా, అప‌జ‌యాల‌కు కుంగ‌కుండా నిల‌క‌డ‌గా ఉంటూ 16 సంవత్సరాల్లో నితిన్ 20 సినిమాలు చేశారు, ఇది గొప్ప విష‌యం. నాకూ, నితిన్‌కీ వ‌య‌సు పెద్ద తేడా ఉన్న‌ప్ప‌టికీ, సినిమాల అనుభవం ప‌రంగా ఐదారేళ్ల తేడానే.... అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

    నితిన్ వాళ్ల నాన్న‌గారు నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి

    నితిన్ వాళ్ల నాన్న‌గారు నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి

    నితిన్ వాళ్ల నాన్న‌గారు నాకు ఇష్ట‌మైన వ్య‌క్తి. కృష్ణ చైతన్యగారు బలమైన స్క్రిప్టు తయారు చేశారు. త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు కాక‌ముందు నుంచీ `ఖుషీ`స‌మ‌యం నుంచీ తెలుసు. మ‌ణిశ‌ర్మ‌గారిని `నాకు ఓ హిందీ పాట కావాలి. థియేట‌ర్‌లో గెంతులు వేయాలి` అని అడిగా. ఆయ‌న బాధ్య‌త‌ను త‌మ‌న్ మీద పెట్టారు. అలాంటి మంచి పాట ఈ రోజుకూ గుర్తుండటానికి కారణం తమన్. అలాంటి తమన్ సంగీత సారథ్యంలో సినిమా వస్తున్నందుకు ఆనందంగా ఉంది... అని పవన్ కళ్యాణ్ అన్నారు.

    ఈ సినిమాకు నేను నిర్మాతను అయినప్పటికీ

    ఈ సినిమాకు నేను నిర్మాతను అయినప్పటికీ

    ఈ సినిమా నిర్మాత‌ల్లో నేను ఒక‌డిని అయిన‌ప్ప‌టికీ దీనికి పని చేసిన చాలా మంది నాకు తెలియ‌దు. అందరికీ పేరుపేరునా ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా మీ అందరికి ఆనందాన్ని కలిగిస్తుందని మ‌న‌స్ఫూర్తి తెలియజేసుకుంటూ, నితిన్ మరిన్ని విజయాలు పొందాలని, కృష్ణ‌చైత‌న్య‌గారు మరిన్ని హిట్ సినిమాలు చేయాలని, సుధాకర్ రెడ్డిగారు మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగం ముగించారు.

    English summary
    Pawan Kalyan Superb Speech about Nithiin at Chal Mohan Ranga Pre Release Event on Sreshth Movies. Pawan Kalyan Creative Works and Sreshth Movies Present ChalMohanRanga 2018 Telugu Movie ft. Nithin / Nitin & Megha Akash. Produced by Pawan Kalyan & Sudhacar Reddy. Story by Trivikram. Music by Thaman S. #ChalMohanRanga Latest 2018 Telugu Movie is directed by Krishna Chaitanya.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more