twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంచనాలు పెంచిన నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ ట్రైలర్

    By Bojja Kumar
    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నిర్మాణంలో భాగం కావడంతో నితిన్ హీరోగా తెరకెక్కిన 'ఛల్ మోహన్ రంగ' సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఆదివారం ప్రీ రిలీజ్ ఈ వెంట్ సందర్భంగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై మరింత హైప్ వచ్చింది.

    నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా కృష్ణ చైతన్య దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రాన్ని శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    క్యూట్ లవ్ స్టోరీ, హీరోయిన్ మేఘా ఆకాష్, నితిన్ మాస్ యాక్షన్ సీన్లు ట్రైలర్లో హైలెట్ అయ్యాయి. 'ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు, మీతో వచ్చిన ప్రాబ్లమ్ ఇదేనండి.. మీరే పట్టుకుంటారు.. మీరే వెళిపోమంటారు' లాంటి డైలాగుల్లో త్రివిక్రమ్ స్టైల్ కనిపిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్టు అందించిన విషయం తెలిసిందే.

    Chal Mohan Ranga Theatrical Trailer

    ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నితిన్, మేఘా ఆకాష్‌తో పాటు డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

    English summary
    Chal Mohan Ranga Theatrical Trailer on Sreshth Movies. Pawan Kalyan Creative Works and Sreshth Movies Present Chal Mohan Ranga Movie. #ChalMohanRanga 2018 Telugu Movie ft. Nithin / Nitin & Megha Akash. Produced by Pawan Kalyan & Sudhacar Reddy. Story by Trivikram. Music by Thaman S.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X