»   » మేఘా ఆకాష్ ఇంటర్వ్యూ: నితిన్ షై పర్సన్, మియామీ సంఘటన మరిచిపోలేను...

మేఘా ఆకాష్ ఇంటర్వ్యూ: నితిన్ షై పర్సన్, మియామీ సంఘటన మరిచిపోలేను...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Megha Akash Exclusive Interview

నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఛల్ మోహన్ రంగ'. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించగా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంది. ఏప్రిల్ 5న సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు జోరందుకున్నాయి. హీరోయిన్ మేఘా ఆకాష్ తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

కొత్త వారితో చేసిన ఫీలింగ్ లేదు

కొత్త వారితో చేసిన ఫీలింగ్ లేదు

నితిన్‌తో కలిసి ఇంతకు ముందు ‘లై' సినిమా చేశాను. ఈ సినిమాకు మధు, ఎడిటర్ శేఖర్ లాంటివారు పని చేశారు. ‘ఛల్ మోహన్ రంగ' సినిమాలో కూడా మధు, ఎడిటర్ శేఖర్ తదితరులు భాగం కావడంతో కొత్తవారితో చేసిన ఫీలింగ్ కలగలేదని మేఘా ఆకాష్ తెలిపారు.

నితిన్ షై పర్సన్

నితిన్ షై పర్సన్

నితిన్ చాలా షై పర్సన్. అయితే షూటింగ్ సమయంలో చాలా సరదాగా ఉంటారు. అతడితో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది అని మేఘా ఆకాష్ తెలిపారు. సినిమా షూటింగ్ జరిగినంత సేపు చాలా ఎంజాయ్ చేస్తూ చేశామని తెలిపారు.


మేఘ క్యారెక్టరైజేషన్ నచ్చడం వల్లే

మేఘ క్యారెక్టరైజేషన్ నచ్చడం వల్లే

‘ఛల్ మోహన్ రంగ' సినిమా కథ నాకు ఎంతో నచ్చింది. ముఖ్యంగా మేఘ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా అనిపించింది. దర్శకుడు కృష్ణ చైతన్య స్టోరీ నేరేట్ చేసిన తీరు చాలా బావుంది. ఈ సినిమాలో మేఘా మీద ఓ పాట కూడా ఉంది. షూటింగ్ సమయంలో కూడా అంతా చాలా బాగా సపోర్ట్ చేశారు అని మేఘా ఆకాష్ తెలిపారు.


 మియామీ సంఘటన మరిచిపోలేను

మియామీ సంఘటన మరిచిపోలేను

అమెరికాలోని మియామిలో సాంగ్ షూటింగ్ జరుగుతున్నపుడు స్టేజీ మీద నుండి పడిపోయాను. లక్కీగా ఏమీ కాలేదు. నేను పడిపోవడంతో అంతా కంగారు పడ్డారు. నాకు దెబ్బలేమీ తగలక పోవడం, పడిపోయిన వెంటనే నేను పెద్దగా నవ్వడంతో అందరూ కూల్ అయ్యారు, ఈ సినిమా షూటింగులో ఇది నాకు మరిచిపోలేని సంఘటన అని మేఘా తెలిపారు. షూటింగ్ సమయంలో మధు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు, నాకు ఏ హెల్ప్ కావాలన్నా వెంటనే చేసి పెట్టేవాడు అని మేఘ తెలిపారు.


English summary
Chal Mohana Ranga actress Megha Akash Exclusive Interview. Chal Mohan Ranga movie is a romantic entertainer directed by Krishna Chaitanya and jointly produced by Tivikram and Pawan Kalyan under PK Creative Works and Sreshth Movies banner while Thaman S scored music for this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X