»   » చలాకీ చంటి వెడ్డింగ్ రిసెప్షన్లో నటి రోజా సందడి (ఫోటోస్)

చలాకీ చంటి వెడ్డింగ్ రిసెప్షన్లో నటి రోజా సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా 'చలాకీ చంటి'గా పాపులర్ అయిన చంటి వివాహం ఇటీవల(ఏప్రిల్ 24) హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి వేడుకలో బంధువులు, సన్నిహితులతో పాటు కొందరు జబర్దస్త్ టీం సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

వివాహం అనంతరం చంటి గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులను ఆహ్వానించారు. ఈ వేడుకకు జబర్దస్త్ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న నటి రోజా కూడా హాజరయ్యారు. రోజా రాకతో వెడ్డింగ్ రిసెప్షన్ మరింత సందడిగా మారింది.

రోజా రాకతో వెడ్డింగ్ రిసెప్షన్ ప్రాంగణం విజిల్స్ తో మారుమ్రోగి పోయింది. తనకు ఇప్పటికీ ఇంత రెస్పాన్స్ రావడంపై రోజా కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. సినీ రంగానికి చెందిన చంటి స్నేహితులు కూడా ఈ వేడుకలో సందడి చేసారు.

ప్రస్తుతం చంటి వరుస సినిమా అవకాశాలతో బిజీగా గడుపుతున్నాడు. దీంతో పాటు పలు టీవీ షోలో కూడా చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తున్నాడు. చంటి వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

రోజా

రోజా

చంటి వెడ్డింగ్ రిసెప్షన్ లో నటి రోజా, జబర్దస్త్ టీం మెంబర్స్.

భార్యతో..

భార్యతో..

తన భార్యతో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ లో చంటి.

సెల్పీ

సెల్పీ

వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా సెల్ఫీలతో సందడి చేసిన చంటి.

విజిల్స్..

విజిల్స్..

రోజాను చూసి కొందరు ఫ్యాన్స్ విజిల్స్ వేసారు.

English summary
Comedian Chalaki Chanti, who shot to fame with E TV's popular comedy show Jabardasth, entered the wedlock, on Sunday 24 April. If you recall, there were many jokes and skitS on his delayed marriage and his friends, on a lighter note, often teases him that he is past the age of marriage. Now, it's a curtains down for all the trolls on his marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu