twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నటుడు చలపతి రావు

    ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చలపతి రావు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్షమాపణ కూడా చెప్పారు.

    చలపతి రావు కామెంట్స్ మీద సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు అందరూ ఆయన వ్యాఖ్యల్ని ముక్త కంఠంతో ఖండించారు. తన వ్యాఖ్యలకు తానే సిగ్గు పడుతున్నానని, ఇక ఇలా ఎప్పుడూ మాట్లాడబోనని చలపతి రావు కూడా బహిరంగ లేఖ రాసారు.

    కాగా తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చలపతి రావు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    పేదరికం నుండి

    పేదరికం నుండి

    ‘నేను సినిమాల్లోకి రాకముందే ప్రేమ వివాహం చేసుకున్నాను. నాకు 27 ఏళ్ల వయసు ఉన్నపుడే నా భార్య చనిపోయింది. అప్పటికి నేను చాలా పేదరికంలో ఉన్నాను అని చలపతిరావు తెలిపారు.

    ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

    ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

    భార్య చనిపోయే సమయానికి నాకు ముగ్గురు పిల్లలు. ఆ సమయంలో ఏమి చేయాలో అర్థం కాలేదు. కళ్ల ఎదురుగా ముగ్గురు పిల్లలు, ఆర్థిక ఇబ్బందులు. ఓసారి ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ నేను చనిపోతే నా పిల్లలు రేపు అడుక్కుతింటే.... పరిస్థితి ఏమిటి? అని ఆలోచించి ఆ ఆలోచన విరమించుకున్నాను అని చలపతి తెలిపారు.

    అందుకే మళ్లీ పెళ్లి చేసుకోలేదు

    అందుకే మళ్లీ పెళ్లి చేసుకోలేదు

    మరో పెళ్లి చేసుకుంటే వచ్చే ఆవిడ పిల్లలను సరిగా చూసుకుంటుందో? లేదో? అనే సందేహంతో మళ్లీ పెళ్లి చేసుకోలేదని..... మాఊరు ఎప్పుడూ దాటని మా అమ్మ గారిని పిల్లలను పెంచడానికి మద్రాస్ తీసుకెళ్లినట్లు చలపతిరావు చెప్పుకొచ్చారు.

    ఇపుడు హ్యాపీ

    ఇపుడు హ్యాపీ

    పిల్లల కోసమే తాను పెళ్లి చేసుకోకుండా ఇంతకాలం కష్టపడ్డానని, ఇపుడు నా ఇద్దరు కూతుళ్లు అమెరికాలో సెటిల్ అయ్యారు, కొడుకు రవి బాబు డైరెక్టర్‌గా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. నా జీవితం ఇపుడు చాలా హ్యాపీగా ఉందని చలపతిరావు తెలిపారు.

    చలపతి రావు రారండోయ్ వివాదం

    చలపతి రావు రారండోయ్ వివాదం

    'రారండయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో ఆడవాళ్లను ఉద్దేశించి చలపతిరావు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు ఆయనపై కేసు కూడా పెట్టారు.
    అయితే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ ఆయన బహిరంగ లేఖ రాసారు. ఈ వయసులో తాను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదని పశ్చాత్తాప పడ్డారు.

    చరిత్ర హీనుడిగా మార్చారు

    చరిత్ర హీనుడిగా మార్చారు

    ‘డబ్భై మూడేళ్ల వయసులో, 50 సంవత్సరాల సినీ జీవితంలో, అనాలోచితంగా, అన్యాపదేశంగా నేను చేసిన ఒక వ్యాఖ్య, దురదృష్టకరం. ఒక మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న ఇది.‘ఆడవాళ్లతో హానికరమా' దానికి జవాబుగా నేను ‘ఆడవాళ్లు హానికరం కాదు'. ఆ తరువాత నేను చేసిన ఒక వ్యాఖ్యను టీవీల్లో పదేపదే ప్రసారం చేసి నన్ను ఒక చరిత్ర హీనుడిగా మార్చేసిన పరిస్థితి.... అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

    ఎలాంటి షరతు లేకుండా క్షమాపణ

    ఎలాంటి షరతు లేకుండా క్షమాపణ

    నా వ్యాఖ్యలు నాకే వెగటు పుట్టించాయి. అవి నేను చేయకుండా ఉండాల్సింది. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరమే కాదు, ఆక్షేపణీయం కూడా. అందుకు నేను ఎటువంటి షరతులు లేకుండా క్షమాపణలు చెబుతున్నాను.... అని చలపతి తెలిపారు.

    నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే

    నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే

    ఇదే సందర్భంలో నాదొక చిన్న మనవి. సినిమాల్లో, టీవీల్లో చివరాఖరికి, ఇప్పటి సామాజిక మాధ్యమాల్లో, మహిళల్ని కించపరిచే మాటలకు, దృశ్య శ్రవణాలకు మనందరం బాధ్యలమే! పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా! ఆ విషయం మనందరికీ తెలుసు. నాతో పాటు అందరం దీనికి బాధ్యత వహించాల్సిందే. సినిమాల్లో చూపించే దృశ్యాలు, చెప్పేమాటలకు పరిశ్రమలోని రచయితలు, నిర్మాతలు, దర్శకులు, నటులు అందరం బాధ్యత వహించాలి... అని చలపతి వ్యాఖ్యానించారు.

    ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

    ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు

    ఇకముందు నేనే కాదు, మరెవ్వరూ ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితికి కారణం కాకూడదు. నా మాటలకు, వ్యాఖ్యలకు అందరికీ, మరోసారి క్షమాపణలు చెబుతున్నాను. మన్నించండి!
    మీ
    చలపతిరావు'
    అని ఆ లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Chalapathi Rao opened up about his personal life in a recent interview.He lost his wife when his three kids were still very young. Those were the days when he was struggling for offers and he had no one take care of the children. Then, he wanted to commit suicide because he was frustrated that he can’t bring them up with the meager resources he had at that time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X