twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సమయంలో చచ్చిపోవాలి అనిపించింది: చలపతి రావు

    |

    తెలుగు సీనియర్ నటుల్లో ఒకరైన చలపతిరావు తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తనకు ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి వెల్లడించారు. ఆ ప్రమాదం తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలిపారు.

    భీమినేని శ్రీనివాసరావు అనే దర్శకుడు బస్సు మీద షూటింగ్ పెట్టాడు. నేను, సునీల్, హీరోయిన్ దాని మీద ఎక్కి ప్రయాణం చేయాలి. ఆ బస్సు నేను పుట్టకముందు తయారైన బస్సు. ఆ డొక్కు బస్సు చూసినపుడే అనుమానం వచ్చింది. కానీ నేను ఏ నాడు ఇలా ఉంటే సీన్ చేయను అనలేదు. అందుకే ప్రమాదమని నా మనసు హెచ్చరిస్తున్నా తెగింగిపుగా బస్సెక్కినట్లు చలపతిరావు తెలిపారు.

    కళ్లు తెరిచేసరికి ఆసుపత్రిలో దారుణమైన స్థితిలో

    కళ్లు తెరిచేసరికి ఆసుపత్రిలో దారుణమైన స్థితిలో

    ఆ సీన్ అయిపోయిన తర్వాత దిగుతుంటే కాలు జారి బస్సు పై నుంచి కింద పడిపోయాను. కాలు జారడం వరకే గుర్తుంది, ఆ తర్వాత స్పృహ లేదు. 3వ రోజో, 4వ రోజో స్పృహలోకి రాగానే చూస్తే అపోలో ఆసుపత్రిలో ఉన్నాను. పక్కటెముకలు, నడుము, కాలు విరిగిపోయి ఉంది. కదలడానికి వీల్లేని పరిస్థితి వచ్చిందని చలపతిరావు తెలిపారు.

    ఇక బ్రతకడం ఎందుకు అనిపించింది

    ఇక బ్రతకడం ఎందుకు అనిపించింది

    ఆరేడు నెలలు మంచం మీదే ఉండాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో ఇక బ్రతకడం ఎందుకు అనిపించింది. కిందపడ్డప్పుడు కంట్లో నుంచి రక్తం వచ్చిందట. కళ్లు కూడా కనిపించడం లేదు. ఇక నాకు కళ్లు కనిపించవేమో అనుకున్నాను. కాలు పోయింది, కన్ను పోయింది ఇక బ్రతకడం ఎందుకు అనిపించింది. అయితే అక్కడ డాక్టర్ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు చూపు వస్తుంది అని మూడు ఆపరేషన్లు చేసిన తర్వాత నాకు చూపు వచ్చింది... అని చలపతిరావు గుర్తు చేసుకున్నారు.

    వీల్ చైర్లో కూర్చోబెట్టి షూటింగుకు తీసుకెళ్లారు

    వీల్ చైర్లో కూర్చోబెట్టి షూటింగుకు తీసుకెళ్లారు

    ‘వినయ విధేయ రామ' షూటింగ్ మొదట కొంత నాతో షూటింగ్ చేశారు. ఆ తర్వాత ఈ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు నాతో షూట్ చేయాల్సి ఉంది. వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టి షూటింగుకు తీసుకెళ్లారని చలపతిరావు తెలిపారు.

    అపుడు బోయపాటి పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు

    అపుడు బోయపాటి పువ్వుల్లో పెట్టి చూసుకున్నారు

    బోయపాటికి నిజంగా థాంక్స్ చెప్పాలి. ఉన్న డైరెక్టర్లలో బోయపాటి పెద్దవారికి గౌరవం ఇస్తారు. బాబాయ్ ఆసుపత్రిలో ఎన్నాళ్లు ఉంటాడు? జనంలోకి వస్తే త్వరగా బాధలు మరిచిపోతారు అని నన్ను వీల్ చెయిర్ మీద కూర్చోబెట్టి బ్యాంకాక్ షూటింగుకు తీసుకెళ్లారు. షూటింగ్ జరిగినంత సేపు నన్ను పూవుల్లో పెట్టి చూసుకున్నారని గుర్తు చేసుకున్నారు.

    English summary
    Chalapathi Rao participated in in Alitho Saradaga show. On this occasion, he revealed about a bus accident in the shooting of a movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X