»   » అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు.. చలపతిరావు షాకింగ్ కామెంట్.. సూపర్ జవాబు.. యాంకర్ రవి సమర్ధన

అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు.. చలపతిరావు షాకింగ్ కామెంట్.. సూపర్ జవాబు.. యాంకర్ రవి సమర్ధన

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోసైటీలో ప్రముఖులుగా చలామణి అయ్యేవారు తాము ఎక్కడ ఉన్నామో.. ఎవరి మధ్య ఉన్నామో.. తమ హోదా ఏమిటనే విషయం మరిచిపోతుంటారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సినీ ప్రముఖులు చాలా సందర్భాల్లో మాటలు జార విడిచి నాలిక కొరుక్కొన్న సందర్భాలు ఉన్నాయి. తమ మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పిన దాఖలాలు ఎన్నో చూసి ఉంటాం. ప్రస్తుతం ఈ చర్చ ఎందుకంటే టాలీవుడ్‌లో సీనియర్ నటుడు చలపతిరావు మహిళలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు.

యాంకర్ అనసూయ, సుమ, హీరోయిన సమంత, తదితరులపై అలీ చేసిన కామెంట్లు..


చలపతిరావు వెకిలి ప్రశ్న

చలపతిరావు వెకిలి ప్రశ్న

అక్కినేని నాగచైతన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో ఫంక్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు అతిగా స్పందించిన చలపతిరావు ఇబ్బందుల్లో పడ్డాడు. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్న చలపతిరావు వెకిలి మాటలపై ప్రస్తుతం దుమారం రేగుతున్నది.


మనఃశాంతికి హానికరం కాదు..

మనఃశాంతికి హానికరం కాదు..

ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో యాంకర్ మాట్లాడుతూ.. మనందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న చలపతిరావు ఇక్కడ ఉన్నారు. అమ్మాయిలు మనఃశాంతికి హానీకరమా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అమ్మాయిలు మనఃశాంతికి హానికరం కాదు గానీ.. పక్కలోకి పనికి వస్తారు అని కామెంట్ చేశారు. దాంతో అక్కడ ఉన్న వారందరూ అమ్మాయిలను చూస్తూ పడిపడి నవ్వారు. అలాంటి సమాధానాన్ని ఊహించిన యాంకర్ అవాక్కయ్యారు.


సూపర్ అన్సర్ అంటూ యాంకర్ రవి..

సూపర్ అన్సర్ అంటూ యాంకర్ రవి..

నటుడు చలపతిరావు చేసిన ఇలాంటి వ్యాఖ్యలపై ఖండించాల్సి పోయి.. యాంకర్ రవి మాత్రం సూపర్ సమాధానం ఇచ్చారు అంటూ ఆయనను సమర్ధించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవి హోస్ట్‌గా నిర్వహించే పటాస్ కార్యక్రమమైతే ఇంకా చెప్పనక్కర్లేదు. ఆ టీవి కార్యక్రమం అంతా బూతు తప్పా మరోకటి కనిపించదు. ఇటీవల నర్సులను ఉద్దేశించి ఆ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై కేసు కూడా నమోదైంది.


ప్రముఖులకు అలవాటే..

చలపతిరావు ఎన్నో దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. పెద్దతనంతో హుందాగా వ్యవహరిస్తారు. అలాంటి వ్యక్తి నుంచి ఈ రకమైన కామెంట్లు రావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సీనియర్ నటుడైన ఆలీ కూడా పలువురు యాంకర్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.Video courtesy : NTV


English summary
Tollywood's Senior actor Chalapatirao made derogatory comments on women. This comments made in Rarandoy Vedukachuddam Audio release function. He made comment that Women only useful on bed. Not harmful for mens mental strength.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more