చలో చలో’ అంటున్న రానా.. గూంజ్ బంప్స్ తెప్పిస్తున్న ‘విరాట పర్వం’ వారియర్ సాంగ్
వేణు ఊడుగుల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో దగ్గుబాటి రానా నటిస్తున్న తాజా చిత్రం విరాట పర్వం. ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతుంది. నీది నాది ఒకే కధ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో 1990వ దశకంలో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ విరాటపర్వం సినిమాలో డా. రవి శంకర్ అలియాస్ నక్సలైట్ నాయకుడు కామ్రేడ్ రవన్నగా రానా తన విశ్వరూపాన్ని మరోసారి ప్రదర్శించనున్నాడని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ఎన్నోసార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఈ మధ్యనే చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాను ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇటీవల మూడు సాంగ్స్ 'కోలు కోలు', 'వీర తెలంగాణ', 'నగాదారిలో' రిలీజ్ అయి చి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా తాజాగా మరో మాస్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'చలో చలో' అనే పేరుతో ది వారియర్ అంటూ సాగుతున్న సాంగ్ అంటూ విడుదల చేశారు.

స్వయంగా రానా పాడిన ఈ సాంగ్ కు జిలుకర శ్రీనివాస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. పవర్ ఫుల్ వాయిస్ తో రానా పాటకు ప్రాణం పోశారు. పాటకు తగ్గట్టే విజువల్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి కనిపించనున్నారు. నివేదా పెతురాజ్, ప్రియమణి, నందితాదాస్, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీరావ్, సాయిచంద్, బెనర్జీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డి. సురేష్‌బాబు సమర్పణలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











