Don't Miss!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Sports KKR Playing XI: రూ. 24.75 కోట్ల ఆటగాడిపై వేటు! పంజాబ్‌తో తలపడే కేకేఆర్ తుది జట్టు ఇదే!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
షూటింగులోనే అతడితో ప్రేమలో పడ్డా, త్వరలో పెళ్లి: ‘ఛలో’ హీరోయిన్ రష్మిక
Recommended Video
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఛలో'. ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా కన్నడ హీరోయిన్ రష్మిక తెలుగు తెరకు పరిచయం అవుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా రష్మిక మంగళవారం మీడియాతో ముచ్చటించారు.
తన కెరీర్ గురించి
నేను కర్నాటకలో ‘కూర్గ్' నుండి వచ్చాను. కూర్గ్ లో నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత మైసూర్, బెంగుళూరులో చదువుకున్నాను. బెంగులూరులో డిగ్రీ చదువుతున్న సమయంలో కన్నడమూవీ ‘కిరిక్ పార్టీ'లోఆఫర్ వచ్చింది. అదే నా తొలి సినిమా. ఆ తర్వాత ‘అంజనీపుత్ర' తదితర చిత్రాల్లో నటించా. ఈ సినిమాలు చూసి నాకు ‘ఛలో'లో అవకాశం ఇచ్చారు అని రష్మిక తెలిపారు.
ఈ చిత్రంలో కాలేజీ అమ్మాయిగా నటించాను
నా తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ'లో నేను కాలేజీ అమ్మాయిగా చేశారు, ‘ఛలో'లో కూడా కాలేజీ అమ్మాయిగానే చేస్తున్నాను. కానీ రెండు పాత్రల్లో చాలా తేడా ఉంది. సినిమా కథ, నా క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది... తెలుగు, తమిళ సరిహద్దు దాటి వచ్చిన ఓ కుర్రాడితో ప్రేమలో పడే పాత్ర చేశాను అని రష్మిక తెలిపారు.
నా సొంత భాషలో నటించిన ఫీలింగ్
నాగశౌర్య నాకు చాలా సపోర్టివ్‌గా ఉన్నాడు. సినిమా నిర్మించేది వాళ్ల ఫ్యామిలీ కాబట్టి ఇదో షూటింగులా కాకుండా పిక్నిక్ లాగా సాగింది. తెలుగులో నా తొలి సినిమా ఇది.. మాతృభాషలో నటిస్తున్న ఫీలింగ్ కలిగింది అని రష్మిక తెలిపారు.
ఆ పాట హిట్టవుతుందని అప్పుడే చెప్పా
‘ఛలో' పాటలు చాలా బాగా వచ్చాయి. ‘చూసి చూడంగానే..' పాట చిత్రీకరణ సమయంలోనే ఇది పెద్ద హిట్ అవుతుందని చెప్పా. ఆ పాట ఇపుడు అందరికీ నచ్చింది, మ్యూజిక్ డైరెక్టర్ స్వరసాగర్ మహతి మంచి మ్యూజిక్ ఇచ్చాడు అని రష్మిక తెలిపారు.
వల్గర్ పాత్రలు చేయను
నాకు అనుష్క ఇన్స్‌స్పిరేషన్. ఆమెలాగే గ్లామర్‌గా కనిపిస్తూనే మంచి పాత్రలు చేయాలి. నటన పరంగా మంచి పేరు తెచ్చే గ్లామర్ పాత్రలు చేయాలి. వల్గర్‌గా ఉండే పాత్రలు చేయను అని రష్మిక తెలిపారు.
త్వరలో ఆ హీరోతో పెళ్లి
‘కిరిక్ పార్టీ' సినిమా చేస్తున్న సమయంలోనే ఆ చిత్రంలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టి మంచి స్నేహం ఏర్పడింది. అపుడే ఇద్దరం ప్రేమలో పడ్డాం. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. త్వరలోనే పెళ్లి చేసుకుంటాం.... అని రష్మిక ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం చేస్తున్న మూవీస్
ప్రస్తుతం కన్నడలో రెండు సినిమాల్లో నటిస్తున్నా. తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నా. ‘ఛలో' తర్వాత తెలుగులోనూ మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నాను. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతాను అని రష్మిక తెలిపారు.