మామయ్య పాట, మేగా మేనల్లుడి ఆట.... రీమిక్స్ అదిరిందిగా!

By Bojja Kumar

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరో మెగా సాంగు రీమిక్స్‌తో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సుప్రీమ్ స్టార్ వివి వినాయక్ దర్శకత్వంలో 'ఇంటిలిజెంట్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం రీమిక్స్ ఈ పాటను విడుదల చేశారు.

‘చమక్‌ చమకు ఛాం’

‘కొండవీటి దొంగ' చిత్రంలోని ‘చమక్‌ చమకు ఛాం' సాంగ్‌ను ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేశారు. ఈ సాంగును అప్పట్లో ఇళయరాజా కంపోజ్ చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. తమన్ సారథ్యంలో ఈ పాటను రీమిక్స్ చేశారు.

సినిమాలో హైలెట్ కానున్న సాంగ్

సినిమాలో హైలెట్ కానున్న సాంగ్

అప్పట్లో ‘చమక్‌ చమకు ఛాం' సాంగ్‌ సూపర్ హిట్. ‘ఇంటిలిజెంట్' చిత్రంలోనూ ఈ రీమిక్స్ సాంగ్ హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. మామయ్యను తలపించేలా సాయి ధరమ్ తేజ్ వేసిన స్టెప్స్ చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

ఫిబ్రవరి 9న విడుదల

ఫిబ్రవరి 9న విడుదల

ఫిబ్రవరి 9న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తుండటంతో.. చిత్ర బృందం ప్రమోషనల్ యాక్టివిటీస్ లో వేగం పెంచింది. ఇందులో భాగంగా బాలయ్యతో ఇటీవల టీజర్ విడుదల చేయించారు. రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఓ పాట విడుదల చేయించారు.

నటీనటులు

నటీనటులు

సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. ప థ్వీ, రుబాబు, కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం, నల్ల వేణు, రాహుల్‌ రామకృష్ణ, వెంకీ మంకీ, రాజేశ్వరి నాయర్‌, సంధ్యా జనక్‌, ఫిష్‌ వెంకట్‌, శ్రీహర్ష, శివమ్‌ మల్హోత్రా, రవిరామ్‌ తేజ, తేజారెడ్డి నటిస్తున్నారు.

తెరవెనక

తెరవెనక

ఈ చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌, సంగీతం: థమన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: వెంకట్‌, డాన్స్‌: శేఖర్‌, జాని, సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా, నిర్మాత: సి.కళ్యాణ్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X