Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరుణ్ సందేశ్ 'చమ్మక్ చల్లో' రిలీజ్ డేట్
హైదరాబాద్ : జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో వరుణ్ సందేశ్, సంచితా పడుకొనే, కేధరిన్‌లు నాయకా, నాయికలుగా నటిస్తుండగా శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై నిర్మాత మాస్టర్ బుజ్జిబాబు నిర్మిస్తున్న చిత్రు చమ్మక్ చల్లో. డి.ఎస్.రావు చిత్ర సమర్పకులు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15 న విడుదల చేయనున్నట్లు చిత్ర సమర్పకులు డి.ఎస్.రావు తెలిపారు.
దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ ..'చమ్మక్ చల్లో ' ఓ ప్రేమ కదా చిత్రం. నేటి యువతకి ప్రేమ పట్ల వారి మనోభావాలకు దగ్గరగా ఉండే చిత్రమిది. కళాశాల నేపధ్యంలో మొదలయ్యే ఈ ప్రేమ కదా చిత్రం లో ప్రేమను కొత్తగాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. హీరో తండ్రిగా బ్రహ్మాజీ నటిస్తున్నారని తెలిపారు.
వరుణ్ సందేష్ మాట్లాడూ...నీలకంఠగారి దర్శకత్వంలో చేయడం చాలా హ్యాపీగా ఉంది, నీలకంఠగారు మొదటి సారి చేసిన కమర్షియల్ లవ్ ఎంటర్ టైనర్ ఇది. హ్యాపీడేస్ తరువాత అలాంటి బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం ఇది, హ్యాపీడేస్ ను మించి హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు.
అవసరాల శ్రీనివాస్ , షాయాజీ షిండే , వెన్నెల కిషోర్ , చిన్మయి, సురేఖావాణి తదితరలు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రేమ కదా చిత్రానికి సంగీత దర్శకుడు 'కిరణ్ వారణాసి' అందించిన సంగీతం ఓ హైలెట్. చిత్ర విజయానికి సంగీతం ఎంతగానో దోహద పడుతుందని. ఆడియో కు మంచి స్పందన లభించింది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం; కిరణ్ వారణాసి ; పాటలు: అనంతశ్రీరాం; కెమెరా: రంగనాధ్ గోగినేని; ఎడిటర్: నాగిరెడ్డి; ఆర్ట్: బాబ్జీ ; కాస్ట్యూమ్స్ డిజైనర్ : రమ ; కధ -మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నీలకంఠ.