twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేశ్ 'చమ్మక్ చల్లో' రిలీజ్ డేట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వంలో వరుణ్ సందేశ్, సంచితా పడుకొనే, కేధరిన్‌లు నాయకా, నాయికలుగా నటిస్తుండగా శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై నిర్మాత మాస్టర్ బుజ్జిబాబు నిర్మిస్తున్న చిత్రు చమ్మక్ చల్లో. డి.ఎస్.రావు చిత్ర సమర్పకులు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 15 న విడుదల చేయనున్నట్లు చిత్ర సమర్పకులు డి.ఎస్.రావు తెలిపారు.

    దర్శకుడు నీలకంఠ మాట్లాడుతూ ..'చమ్మక్ చల్లో ' ఓ ప్రేమ కదా చిత్రం. నేటి యువతకి ప్రేమ పట్ల వారి మనోభావాలకు దగ్గరగా ఉండే చిత్రమిది. కళాశాల నేపధ్యంలో మొదలయ్యే ఈ ప్రేమ కదా చిత్రం లో ప్రేమను కొత్తగాగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాడు. హీరో తండ్రిగా బ్రహ్మాజీ నటిస్తున్నారని తెలిపారు.

    వరుణ్ సందేష్ మాట్లాడూ...నీలకంఠగారి దర్శకత్వంలో చేయడం చాలా హ్యాపీగా ఉంది, నీలకంఠగారు మొదటి సారి చేసిన కమర్షియల్ లవ్ ఎంటర్ టైనర్ ఇది. హ్యాపీడేస్ తరువాత అలాంటి బ్యాక్ డ్రాప్ తో వస్తున్న చిత్రం ఇది, హ్యాపీడేస్ ను మించి హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు.

    అవసరాల శ్రీనివాస్ , షాయాజీ షిండే , వెన్నెల కిషోర్ , చిన్మయి, సురేఖావాణి తదితరలు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రేమ కదా చిత్రానికి సంగీత దర్శకుడు 'కిరణ్ వారణాసి' అందించిన సంగీతం ఓ హైలెట్. చిత్ర విజయానికి సంగీతం ఎంతగానో దోహద పడుతుందని. ఆడియో కు మంచి స్పందన లభించింది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం; కిరణ్ వారణాసి ; పాటలు: అనంతశ్రీరాం; కెమెరా: రంగనాధ్ గోగినేని; ఎడిటర్: నాగిరెడ్డి; ఆర్ట్: బాబ్జీ ; కాస్ట్యూమ్స్ డిజైనర్ : రమ ; కధ -మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: నీలకంఠ.

    English summary
    
 Varun Sandesh's 'Chammak Challo' releasing on Feb 15. Chammak Challo directed by Neelakantha, promises to be a love story with a difference.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X