ఏపీ ఎన్నికలపై చాణక్య సర్వే షాకింగ్ రిపోర్ట్.. తెలుగు సినీ పరిశ్రమ సపోర్ట్ ఎటువైపు అంటే?
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు, తెలుగు సినిమా పరిశ్రమకు విడదీయలేని అనుబంధం ఇప్పటిది కాదు. దశాబ్దాల కాలం నుంచి ఏపీ రాజకీయాలపై సినీ నటుల ప్రభావం ఉంది. ఇటీవల కాలంలో ఆంధ్ర రాజకీయాలపై సినిమాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటున్నది. అయితే త్వరలోనే జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా రంగం ప్రభావం భారీగానే ఉండబోతుందనే విషయం అటు సినీ, రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల్లో తెలుగు సినిమా పరిశ్రమ ఎటువైపు అనే వివరాల్లోకి వెళితే..
ఏపీలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టకముందు నుంచి కూడా సినీ నటులు కాంగ్రెస్ పార్టీతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకొన్నారు. జమున, కృష్ణ, జగ్గయ్య లాంటి అగ్ర నటులు కాంగ్రెస్ పార్టీతో కొనసాగారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా వారు కాంగ్రెస్‌కే మద్దతు తెలిపారు.

సమైక్యాంధ్రలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత మురళీమోహన్, జయప్రద, రాజేంద్ర ప్రసాద్ లాంటి అగ్రతారల నుంచి చిన్న నటుల వరకు టీడీపీతోనే కొనసాగారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత కూడా కృష్ణం రాజుతోపాటు పలువురు ఆ పార్టీకి మద్దతు తెలిపారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ.. ఆ పార్టీలో భోగవల్లి ప్రసాద్, బన్నీవాసు లాంటి నిర్మాతలు పార్టీలో చేరారు.ప్రస్తుతం ఇంకా చాలా మంది నటులు ఆ పార్టీలో చేరేందుకు, అలాగే మద్దతు తెలిపేందుకు సిద్దమవుతున్నారు.
ఇక టీడీపీలో ఇప్పటికే భారీగా సినీ తారలు చేరి ఉన్నారు. ఆ పార్టీ సేవలకు చాలా మంది ప్రత్యక్ష్ంగా, పరోక్షంగా సహాయం అందిస్తున్నారు. ఇలా ఏపీ రాజకీయాల్లో సినీతారల అవినాభావ సంబంధం ఉంటూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా ఓ ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన సర్వే సినీ పరిశ్రమలో చర్చకు దారి తీసేలా చేసింది.
తాజాగా చాణక్య అనే సర్వే సంస్థ ఏపీలో మారుతున్న ప్రజల మూడ్‌ను తమ సర్వే రూపంలో వెల్లడించింది. ఈ సర్వేలో టీడీపీ, జనసేన కూటమి 115 నుంచి 128 సీట్లను గెలుచుకోబోతున్నది.అలాగే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టే మూడ్ ఈ సర్వెల వెల్లడైంది అని సర్వే రిపోర్టును రిలీజ్ చేసింది. ఈ సర్వేలో అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని పేర్కొన్నది.

అయితే తాజా చాణక్య సర్వేపై తన పేరు వెల్లడించడానికి నిరాకరించిన సినీ ప్రముఖుడు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో కొందరు మినహాయించి.. చాలా మంది టీడీపీ, జనసేనతో టచ్‌లో ఉన్నారు. ఈసారి రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన సినీ తారల సపోర్ట్ తెలుగుదేశం, జేఎస్పీకి ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











