స్టార్ హీరోయిన్ బెడ్ రూమ్ లోకి తొంగిచూసే ఆఫర్...
ముంబైలోని కొత్తగా కనస్ట్రక్షన్ జరుగుతునన్న ఓ అపార్టమెంట్ ఓనర్ వచ్చే కష్టమర్స్ కి ఓ ఆఫర్ ఇస్తున్నాడు.అదేమిటంటే..స్టార్ హీరోయిన్ కరీనాకపూర్,సైఫ్ అలీఖాన్ కలిసుండే లివింగ్ రూమ్, బెడ్ రూమ్ లోకి తొంగిచూసే అవకాశం ఇస్తానని. అదెలా అంటే తన అపార్టమెంట్లో ప్లాట్ కొంటే ప్రక్క బిల్డింగ్ లో ఉండే ఆ హీరోయిన్ జీవితం దగ్గరనుంచి చూడవచ్చునని. దాంతో ఆ అపార్టమెంట్లో ప్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎంత రేటయినా జనం కొనుక్కోవటానికి రెడీ అవుతున్నారు.
ఇక కరీనాకపూర్ ప్రక్క ఇంట్లో తాము ఉంటే అదో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చునని చాలా మంది భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సైఫ్ ఆ బిల్డర్ ని నిలదీద్దామనుకున్నాడు. కానీ అనవరసంగా మీడియాని ఎట్రాక్ట్ చేసి, ఆ అపార్టమెంట్ కు ప్రీ పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుందని నచ్చచెప్పిందిట. దాంతో బాంద్రాలో మరో హౌస్ కొనే ప్రయత్నాలు సైఫ్ చేస్తున్నారు. ఆ ఇంటికి ఇటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాట్ట. ప్రస్తుతం కరీనా ఏజెంట్ వినోద్, గోల్ మాల్ త్రీ, రా వన్, వుయ్ ఆర్ ఫ్యామిలీ చిత్రాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











