twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చందా కొచ్చార్ సినిమాపై హైకోర్టు స్టే.. నిర్మాతలకు ఆదేశాలు జారీ

    |

    ప్ర‌ముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాకు చందా: ఏ సిగ్నేచ‌ర్ ద‌ట్ రూవండ్ ఏ కేరీర్‌ అనే పీరును కూడా కన్ఫర్మ్ చేసి మేకింగ్ మొదలు పెట్టారు. అయితే ఈ సినిమాలో త‌న‌ను అప‌రాధిగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని పేర్కొంటూ చందా కొచ్చార్ కోర్టును ఆశ్రయించారు.

    ఈ సినిమా విడుదల కాకుండా నిలిపివేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఈ మేరకు ఆమె తన లాయర్ విజయ్ అగర్వాల్, నమన్ జోషిల ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు కేసు నడుస్తున్న సమయంలో తనను అపరాధిగా చూపించే విధంగా సినిమాను నిర్మిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు చందా కొచ్చార్. ఈ సినిమా కోసం సదరు నిర్మాతలు.. చందాకొచ్చార్‌ను ఎప్పుడూ సంప్రదించలేదని ఆమె తరఫు లాయర్ విజయ్ అగర్వాల్ అన్నారు.

     Chanda Kochhar Complaint against movie based on her life.. Delhi court stays On this

    దీంతో ఈ కేసును ప‌రిశీలించిన కోర్టు సినిమాను వెంట‌నే ఆపాలంటూ చిత్ర యూనిట్‌కి ఆదేశాలిస్తూనే సినిమాపై స్టే విధించింది. ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్ లైన్‌లో కానీ సినిమాను రిలీజ్ చేయ‌వ‌ద్దంటూ, చందా కొచ్చ‌ర్ పేరు ప్ర‌త్య‌క్షంగా కానీ, ప‌రోక్షంగా కానీ ఎక్క‌డా ప్ర‌స్తావించ‌కూడ‌ద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అడిషనల్ జడ్జి సందీప్ గార్గ్ ఈ కేసును పరిశీలించి పై ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.

    English summary
    Former ICICI CEO Chanda Kochhar had filed an complaint against the release of a film allegedly based on her life. Delhi court stays release of this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X