సిగరెట్ తాగుతూ మంచులక్ష్మి, హాట్ లుక్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: మంచు లక్ష్మి, సీనియర్ నరేష్, ఆమణి, కృష్ణుడు, నాగ శౌర్య, అభిజిత్, షామిలి, అమితారావు, రిచా పనయ్, చైతన్య కృష్ణ, పృథ్వి, వెన్నెల కిషోర్, కొండవలస, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న చిత్రం 'చందమా కథలు'. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంచు లక్ష్మి హాట్ లుక్‌లో హాజరైంది. విడుదలైన ట్రైలర్లో కూడా ఆమె సిగరెట్ తాగుతూ, మందుకొడుతూ కనిపిస్తుండటంతో సినిమాలో ఆమె పాత్ర విభిన్నంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఈ సినిమా గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ...దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ మంచి సినిమా అని మెచ్చుకుంటారు. డిఫరెంట్ ఫీల్ ఉన్న సినిమా. హార్ట్ టచింగ్ సబ్జెక్ట్ అని తెలిపారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు.....

మార్చి మొదటి వారంలో విడుదల

మార్చి మొదటి వారంలో విడుదల


త్వరలో ఆడియో విడుదల చేసి సినిమాను మార్చి మొదటి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

చందమామ కథలు

చందమామ కథలు


'ఎల్బీడబ్ల్యూ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమై 'రొటీన్‌ లవ్‌స్టోరీ' చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తారు తాజాగా తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం 'చందమామ కథలు'. ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై చాణక్య బూనేటి నిర్మిస్తున్నారు. మంచు లక్ష్మిప్రసన్న, చైతన్య కృష్ణ, సీనియర్‌ నటుడు నరేష్‌, ఆమని, కృష్ణుడు, కిశోర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్‌, ఎడిటింగ్‌:ధర్మేంద్ర కాకర్ల.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...


దర్శకుడు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ... ప్రతి మనిషి నిత్య జీవితంలో ఎన్నో చోట్ల తనకి తారసపడే వ్యక్తుల ద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా సమాజంలో మంచి చెడుల్ని చూస్తుంటాడు. వాటి మధ్య వ్యత్యాసాలను తెలుసుకొని మరి కొన్నింటిని నేర్చుకుంటుంటాడు. అలాగే కొన్ని అనుభవాలను కూడా సంపాదిస్తుంటాడు. అటువంటి కొన్ని పాత్రల అనుభవాలు, పర్యావసనాలు, ఫలితాల సమాహారమే 'చందమామ కథలు'. సినిమా కథాంశం. అన్నారు.

కథ

కథ


అది 1972, ఇంకా ఆధునికతకు అంతగా అలవాటు పడనికాలం... 18ఏళ్ల సరిత, 20 ఏళ్ల మోహన్ ప్రేమించుకున్నారు, పెళ్ళిచేసుకోవా లనుకున్నారు. సరిత ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. అర్థం చేసుకునే అమ్మా నాన్న ఉన్నా మోహన్ తన వైపు నుంచి ఏం చేయలేయక పోయాడు సరిత చివరి ప్రయత్నంగా ఎదిరించింది వాళ్ళు చచ్చిపోతామని బెదిరించారు. దీంతో తల్లితండ్రులు చూపించిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. ఇంత జరిగిన తర్వాత ఇక ఈ దేశంలోనే ఉండడానికి మనసు ఒప్పక మోహన్ అమెరికాకి వెళ్ళిపోయాడు... కాలం వేగం అందుకుంది...40 ఏళ్లు ఎలా గడిచాయో తెలియనంత వేగం...2012, మోహన్ తిరిగి ఇండియాకు వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సస్పెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X