twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘చందమామలో అమృతం’విడుదల ఖరారు(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మన దేశంలో తొలిసారిగా స్పేస్ నేపధ్యంలో తీస్తున్న చిత్రం 'చందమామలో అమృతం'. ఈ చిత్రం దసరాకు విడుదలకానుంది. మొదట ఈ సినిమా ఆగష్టులో విడుదల ప్లాన్ చేసారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ డిలే కావంటంతో ఈ సినిమా దసరాకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం సెకండాఫ్ మొత్తం చంద్రుడిపై జరుగుతుంది.

    ఈ సినిమా హాస్యభరితంగా సాగుతుందని దర్శకుడు రచయిత గుణ్ణం గంగరాజు తెలిపారు. టి.వి సీరియల్ 'అమృతం' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 60 నిముషాల పాటూ సాగే గ్రాఫిక్స్ ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా జస్ట్ యెల్లో మీడియా బ్యానర్ పై నిర్మాణమవుతోంది. శ్రీనివాస్ అవసరాల, హరీష్, వాసు యింటూరి మరియు ధన్య బాలకృష్ణన్ నటిస్తున్నారు.

    అలాగే అమృతం సీరియల్ క్యారెక్టర్స్ కి కొత్త స్టోరీ లైన్ అనుకుని ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్ధాయిలో నవ్వించే చిత్రంగా తయారవుతందని చెప్తున్నారు. త్వరలోనే విడుదల తేదీ పై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. రీసెంట్ గా చిత్రం టీజర్ విడుదలైంది.

    మిగతా విశేషాలు..స్లైడ్ షోలో...

    టీజర్ తో క్రేజ్

    టీజర్ తో క్రేజ్

    లిటిల్ సోల్డియర్స్, అమ్మ చెప్పింది వంటి చిత్రాల ద్వారా దర్శకుడుగా తానేంటో ప్రూవ్ చేసిన గుణ్ణం గంగరాజు మరో సారి మెగా ఫోన్ పట్టి... ఈ చిత్రం రూపొందిస్తున్నారు. తమ టీవీ ప్రొడక్షన్స్ అమృతం సీరియల్ నే సినిమా గా మార్చి చేస్తున్నారు. విభన్నమైన టీజర్ విడుదలతో ఈ చిత్రానికే ఇప్పటికే మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది.

    కొత్త అనుభూతి

    కొత్త అనుభూతి

    అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో చేస్తున్న ఈ చిత్రంలో అమృతం టీమ్ ఇంటూరి వాసు(సర్వం),శివన్నారాయణ(అప్పాజీ) కీ రోల్స్ చేస్తున్నారు. పూర్తి స్దాయి ఫన్ రైడర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు చెప్తున్నారు. చంద్రుడుపై కథ జరగటం కొత్త అనుభూతి ఇస్తుందని యూనిట్ అంటోంది.

    అంచనాలు ఎక్కువే...

    అంచనాలు ఎక్కువే...

    గుణ్ణం గంగరాజు డైరక్ట్ చేసిన జస్ట్ ఎల్లో వారి అమృతం టీవి సీరియల్ తెలుగు వారికి సుపరిచితమే. ఓ హోటల్ చుట్టూ తిరిగే కథలో అల్లుకున్న ఎపిసోడ్స్ తో వారం వారం తెలుగువారిని గిలిగింతలు పెట్టిన ఈ టీవీ సీరియల్ సినిమాగా రానుండటంతో మంచి అంచనాలే ఉన్నాయి.

    గొప్ప అంతరిక్ష చిత్రం..

    గొప్ప అంతరిక్ష చిత్రం..

    గుణ్ణం గంగరాజు మాట్లాడుతూ ''చంద్రమండలంపై జరిగే కథ ఇది. ఓ గొప్ప అంతరిక్ష చిత్రం అని కూడా చెప్పొచ్చు. రెండున్నర గంటలపాటు కడుపుబ్బా నవ్వించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. బుల్లితెరపై ప్రసారమైన ధారావాహికకు ఈ సినిమాకీ మధ్య ఎలాంటి సంబంధం లేదు. కేవలం అందులోని పాత్రలు మాత్రమే ఈ చిత్రంలో కనిపిస్తాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము ''అన్నారు.

    మిస్టర్ బీన్ టైపులో ...

    మిస్టర్ బీన్ టైపులో ...

    ధారావాహికల్లో కనిపించే పాత్రలతో సినిమాల్ని తీయడం అరుదు. ఇదివరకు మిస్టర్‌ బీన్‌ తరహాలో కొన్ని పాత్రలు మాత్రమే వెండితెరపై సందడి చేశాయి. మేం తొలిసారిగా తెలుగులో ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో యాభై నిమిషాలపాటు గ్రాఫిక్స్‌ ఉంటాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని గుణ్ణం గంగరాజు అన్నారు.

    నిరాసపరిచినా...

    నిరాసపరిచినా...

    గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన ...అమ్మ చెప్పింది చిత్రం నిరాసపరిచినా ఈ చిత్రంపై సినీ సర్కిల్స్ లోనే కాక రెగ్యులర్ సినీ వ్యూయర్స్ లో కూడా ఆసక్తి నెలకొని ఉంది. గుణ్ణం గంగరాజు చిత్రం అంటే ఖచ్చితంగా...ఏదో ఒక విభిన్నత ఉంటుందని భావిస్తున్నారు.

    ప్రత్యేకమైన సెట్ లో...

    ప్రత్యేకమైన సెట్ లో...

    సగం చిత్రం అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈచిత్రం షూటింగ్ జరిగింది. చందమామపై లాండ్ చేస్తే ఎలాంటి అనుభూతి వస్తుందో అలాంటి ఎక్సపీరియన్స్ ఈ చిత్రంతో దొరుకుతుందంటున్నారు. సీరియల్‌ని సినిమాగా తీయడం మన తెలుగులో ఇదే తొలిసారి. అయితే అమృతం సీరియల్‌లో వున్న అంశాలు ఏవీ ఈ చిత్రంలో కనబడవు, అందులో నటించిన వాళ్లు మాత్రం కొందరు కన్పిస్తారు.

    అందుకే లేట్...

    అందుకే లేట్...

    షూటింగ్ పూర్తై ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. అయితే చిత్రంలో గ్రాఫిక్స్ కు మేజర్ పార్ట్ ఉంది. దాదాపు 50 నిముషాల పాటు గ్రాఫిక్స్ ఉండటంతో ...అందుకోసం చాలా టైమ్ వెచ్చించాల్సి వస్తోంది. అందులోనూ ఫెరఫెక్షన్ కోసం చూసే గుణ్ణం గంగరాజు దర్శకడు కావటంతో లేటవుతోంది.

    బ్రేక్ ఇస్తుంది..

    బ్రేక్ ఇస్తుంది..

    అవసరాల శ్రీనివాస్ ఈ చిత్రంపై మంచి నమ్మకం పెట్టుకున్నాడు. సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని చెప్తున్నాడు. అష్టాచెమ్మ తరహాలో సినిమా మొత్తం కామెడీతో నడుస్తుందని,గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో చేయాలనే తన కోరిక తీరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

    కొత్త కామెడీ...

    కొత్త కామెడీ...

    తెలుగులో ప్రస్తుతం కామెడీ చిత్రాలుకు మంచి ఆదరణ ఉంది. అయితే పెద్ద హీరోల చిత్రాలకు ప్రయోగం చేయటం కష్టం. దాంతో ఇలాంటి ప్రయోగాత్మక కామెడీ చిత్రాలు ఖచ్చితంగా జనాల్ని ఆకర్షిస్తాయి. తెలిసున్న పాత్రలతో తెలియని ప్రాంతంలో జరిగే కామెడీ ఇది.

    పాత్రలు...

    పాత్రలు...


    ఈ చిత్రంలో సర్వం,అప్పాజీ పాత్రలు అలాగే ఉంచుతున్నారు. వాటికి ఆ పాత్రలు అమృతం సీరియల్ లో చేసిన వారినే ఎంచుకోవటం ద్వారా ఓ లుక్ వస్తోంది. తప్పనిసరిగా ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెరిగి మంచి ఓపినింగ్స్ తెచ్చిపెడతాయని భావిస్తున్నారు.

    తెర వెనక..తెర ముందు...

    తెర వెనక..తెర ముందు...

    జస్ట్ ఎల్లో మీడియా పతాకంపై అవసరాల శ్రీనివాస్, హరీష్, వాసు ఇంటూరి ప్రధానపాత్రధారులుగా స్వీయ దర్శకత్వంలో గుణ్ణం గంగరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘చందమామలో అమృతం'. చిత్ర, ఆహుతిప్రసాద్‌, చంద్రమోహన్‌, కృష్ణ భగవాన్‌, ఎల్‌.బి.శ్రీరామ్‌, రావు రమేష్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌, సంగీతం: శ్రీ, కూర్పు: ధర్మేంద్ర, పాటలు: అనంత శ్రీరామ్‌.

    English summary
    India’s first space film, Gunnam Gangaraju’s ‘Chandamama Lo Amrutham’ is gearing up for a Dussehra launch. The film was supposed to release in August, but extensive VFX work has pushed the film to Dussehra. The film’s second half unfolds on the moon, making it the first Indian film to be set in space.Srinivas Avasarala, Harish, Vasu Inturi and Dhanya Balakrishnan will be seen in lead roles. The film is expected to be a laugh riot and Gunnam Gangaraju is extremely confident about the output.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X