అది రాదు... వీడు మారడు!
హైదరాబాద్: అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రానికి చందమామ రావే అనే టైటిల్ ని ఖరారు చేశారు. అది రాదు.. వీడు మారడు అనే చక్కటి క్యాప్షన్ ని కూడా పెట్టారు.
ఈ చిత్రాన్ని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ కార్పొరేషన్ ప్రోడక్షన్ నెం-1 గా నిర్మాతలు కిరణ్ జక్కంశేట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారతదేశంలో నే మెట్టమెదటి సారిగా ట్విన్స్ ధర్మ-రక్ష అనే వారు సంయుక్తంగా దర్శకత్వ భాద్యతలు స్వీకరించారు. ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్ గా చేస్తుంది. చక్కటి ప్రేమకథ కి గ్రాండియర్ విజువల్స్ తోడయితే ఆ చిత్రం ప్రేక్షకులని కనువిందు చేస్తుంది. ఇప్పటికే టాకీ మెత్తం పూర్తిచేసుకున్న ఈ చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్ చేశారు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ కార్పొరేషన్ ప్రోడక్షన్ లొ కంటిన్యూస్ గా చిత్రాలు చేయ్యాలనుకున్నప్పుడు ట్విన్స్ ధర్మ-రక్ష లు ఇద్దరు వచ్చి కథ చేప్పారు. రియల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. 3 వేరియేషన్స్ ఆఫ్ లవ్‌స్టోరి ఇప్పటి జనరేషన్ కి హర్ట్ కి టచ్ అయ్యే చాలా మంచి పాయింట్ చెప్పారు అని తెలిపారు.
ఇంత మంచి ప్రేమకథ కి హీరో ఎవరా అనుకుంటున్నప్పుడు నవీన్ చంద్ర గుర్తోచ్చారు అందరికి. వెంటనే నవీన్ ని అప్రోచ్ అయ్యాము. నవీన్ విన్న వెంటనే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత ప్రేమకథ కి హీరోయిన్స్ కి చాలా ప్రాముఖ్యత వుంటుంది కాబట్టి లవ్‌బుల్ గర్ల్ ప్రియల్ గోర్ ని సెలక్ట్ చేశాము అన్నారు.

హిమాలయాల్లో షూటింగ్
ఈ చిత్రాన్ని హిల్ స్టేషన్ లో షూట్ చేస్తే నేచురల్ బ్యూటి క్యాప్చర్ చెయ్యచ్చనే ఉద్దేశ్యంతో హిమాలయాల్లో ని అందమైన ప్రదేశాల్లో మైనస్ డిగ్రి కోల్డ్ వాతావరణంలో అత్యద్బుతం గా మెదటి షెడ్యూల్ ని చిత్రీకరించామని తెలిపారు నిర్మాత.

గోవాలో..
తరువాత గోవాలొ ఎక్స్‌ట్రీమ్ హట్ లో రెండవ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాము. మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లోని ఎక్ట్రీమ్ రెయిన్స్ వున్నప్పుడు షూట్ చేశామని తెలిపారు.

మూడు వేరియేషన్స్
మా చిత్రం మూడు వేరియేషన్స్ వున్న లవ్ స్టోరి , మేము చేసిన షూటింగ్ కూడా మూడు వేరియేషన్స్ క్టైమెట్స్ కావటం కాకతాళియంగా భావిస్తున్నాము. ఇంత చక్కటి ప్రేమకథ కి చందమామ రావే అనే టైటిల్ ని ఖరారు చేశాము. అది రాదు..వీడు మారడు అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టామన్నారు.

తెర వెనక
బ్యానర్- ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఫిల్మ్స్ కార్పొరేషన్
కెమెరా- వెంకట ప్రసాద్
సంగీతం- శ్రావణ్
ఎడిటర్- ఎస్.ఆర్.శేఖర్
దర్శకత్వం- ధర్మ-రక్ష


Click it and Unblock the Notifications











