తమిళంలోకి 'చందమామ'

By Staff

Chandamama
ఇప్పుడు తమిళంలో తెలుగు రీమేకులు రాజ్యం యేలుతున్నాయి. బొమ్మరిల్లు( తమిళ రీమేక్ 'సంతోష్ సుబ్రమణ్యం'), 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే'(తమిళ రీమేక్ యారాది నీ మోహిని') సినిమాలు అక్కడకి వెళ్ళి పెద్ద హిట్ లను నమోదు చేసుకున్నాయి. తాజాగా మరో సినిమా తెలుగు చందమామ కూడా రీమేక్ అవుతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చి హిట్ అయిన ఈ సినిమాను 'అ ఆ ఇ ఈ' అనే పేరుతో ప్రఖ్యాత ఎవిఎం ప్రొడక్షన్స్ సంస్థ తమిళంలో రీమేక్ చేస్తోంది. తెలుగులో చందమామ లో హీరోలుగా నటించిన నవదీప్, శివబాలాజీ అక్కడా నటించనున్నారు. హీరోయిన్లు మాత్రం మారుతున్నారు. నవదీప్ సరసన చేసిన కాజల్ అగర్వాల్ పాత్రకు మౌనిక ('మా అల్లుడు వెరీ గుడ్' ఫేమ్), శివబాలాజీ సరసన చేసిన సింధు మీనన్ పాత్రకు శరణ్య మేరీ ఎంపికయ్యారు.

కాగా హీరోయిన్ తండ్రిగా నాగబాబు చేసిన పాత్రను ప్రభు పోషించనున్నాడు. పందెం ఫేమ్ సభాపతి దర్శకత్వం వహించే ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ సంగీత దర్శకుడు. అలాగే తమిళ నేటివిటికి అనుగుణంగా మార్పులు చేర్పులతో 'అ ఆ ఇ ఈ' ని మారుస్తున్నారు. ఈ రీమేక్ కూడా హిట్ అయితే తెలుగు సినిమా పరిస్థితి మరింత మారుతుంది. శ్రధ్దతో చేస్తే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధించి రీమేక్ రైట్స్ మంచి రేటుకు అమ్ముడవుతాయి అనే విషయం అందరికి అర్ధమవుతుంది...మరింత అర్ధవంతమైన చిత్రాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ పరిశ్రమ పెద్దలు ఆనందపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X