రామ్ చరణ్ సరసన తెలుగుమ్మాయి చాందినీ చౌదరి!
హైదరాబాద్: రామ్ చరణ్, వెంకటేష్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. కృష్ణ వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి హీరోయిన్స్ ఖరారు కావాల్సి ఉంది. రామ్ చరణ్ సరసన నటించే అమ్మాయి...తెలుగు అమ్మాయి అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నారు. ముఖ్యంగా ఆమె కథ ప్రకారం సంప్రదాయ గ్రామీణ తెలుగు అమ్మాయిగా కనపడాలి. అలాంటి ఫేస్ కోసం గత కొద్ది రోజులుగా అన్వేషిస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...ఆ పాత్రకు చాందిని చౌదరి అనే పదహారణాల తెలుగమ్మాయిని ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాందినీ చౌదరి ఇప్పటికే పలు షార్ట్ ఫిల్మ్ నటించింది. ఆమె పెర్ఫార్మెన్స్, రూపం నచ్చి కృష్ణ వంశీ ఆమెను తీసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే చాందినీ చౌదరి లక్కీ ఛాన్స్ కొట్టినట్లే అని ఫిల్మ్ నగర్ టాక్. దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

ఈ చిత్రాన్ని నిర్మాత బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మించనున్నారు. కొత్త సంవత్సరంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ స్లిమ్ లుక్‌లో సరికొత్తగా కనిపించనున్నారు. కృష్ణ వంశీ తనదైన స్టైల్‌లో సినిమాను తెరకెక్కించబోతున్నారు.
వెంకటేష్ సరసన ఎవరిని ఎంపిక చేస్తున్నారు? అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా దీన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు కృష్ణ వంశీ.


Click it and Unblock the Notifications











