twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సవ్యసాచి అందుకే ఫ్లాప్ అయింది.. డైరెక్టర్ కామెంట్స్

    |

    మొదటి చిత్రం కార్తికేయతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు చందూ మొండేటి. ఆపై ప్రేమమ్ రీమేక్‌ను తెరకెక్కించి మరోసారి సత్తాచాటాడు. అయితే రీమేక్ తెరకెక్కించడంలో సఫలమైన చందూ మొండేటికి మరో ఛాన్స్ ఇచ్చాడు నాగ చైతన్య. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఆ చిత్రమే సవ్యసాచి. అయితే టీజర్, ట్రైలర్‌తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించిన సవ్యసాచి పూర్తి చిత్రంగా ఆకట్టుకోలేకపోయింది.

    తెలుగు తెరపై మాధవన్ మెరవడం, కాన్సెప్ట్ కొత్తగా ఉండటం, ప్రతిభ గల దర్శకుడు కావడంతో సవ్యసాచికి మంచి డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా మైత్రి మూవీస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రం కావడంతో అందరూ ఓ స్థాయిలో ఊహించుకున్నారు. తీరా చూస్తే బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. అంతలా బెడిసి కొట్టడానికి గల కారణాలను తాజాగా దర్శకుడు చందూ మొండేటి వివరించాడు.

    Chandoo mondeti Reasons About Savyasachi Flop

    విభిన్నమైన కథ రాసుకుంటే.. దాన్ని అంతే విభిన్నంగా తెరకెక్కించాలని తెలిపాడు. కమర్షియల్ హంగుల పేరిట అనవసరమైనవి చేర్చకూడదని అన్నాడు. సవ్యసాచి విషయంలో అదే తప్పు జరిగిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా తాను తీసుకున్న నిర్ణయాల వల్లే తప్పులు జరిగాయని ఒప్పుకున్నాడు. ఆ సినిమా ఫలితం తనను, నాగచైతన్యను నిరాశకు గురి చేసిందని అన్నాడు. అయినా నాగచైతన్యతో స్నేహం పదిలంగానే ఉందని పేర్కొన్నాడు. కార్తికేయ-2 టీజర్ చూసి అభినందించాడని తెలిపాడు.

    English summary
    Chandoo mondeti Reasons About Savyasachi Flop. He Says That Never Mix New Concept With Commercial Aspects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X