twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నటుల కొడుకులు తాగి రోడ్లపై.. నరకాన్ని చూశారు.. విశ్వనాథ్‌తో ఇబ్బంది.. చంద్రమోహన్

    తెలుగు సినిమా పరిశ్రమలో చంద్రమోహన్ దిగ్గజ నటుడు. ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను అలరింపజేశాయి. ఆయన ఐదు తరాల నటులతో పనిచేశారు.

    By Rajababu
    |

    తెలుగు సినిమా పరిశ్రమలో చంద్రమోహన్ దిగ్గజ నటుడు. ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకులను అలరింపజేశాయి. ఆయన ఐదు తరాల నటులతో పనిచేశారు. ఆయన పక్కన తొలిసారి నటించిన హీరోయిన్లు సూపర్ స్టార్లు అయ్యారు. వారిలో జయసుధ, విజయశాంతి లాంటి హీరోయిన్లు ఉన్నారు. టాలీవుడ్‌లో ఘనమైన చరిత్ర ఉన్న చంద్రమోహన్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. చాలా మందికి తెలియని విషయాలను వెల్లడించారు.

    వాళ్ల పరిస్థితి దారుణం..

    వాళ్ల పరిస్థితి దారుణం..

    నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నవారిలో సినీయర్ నటులు కాంతారావు, రాజనాల, ముక్కమాల, సావిత్రి, ఛాయాదేవి తదితరులు ఉన్నారు. వాళ్లు చాలా బిజీ. మూడు, నాలుగు కాల్షీట్లు పనిచేసేవారు. వాళ్లు ఆస్తులు సంపాదించుకొన్నారో తెలీదు. కానీ ఆ తర్వాత వాళ్ల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా మారింది.

    ఘంటసాల ఆర్థికంగా దెబ్బ తిన్నారు..

    ఘంటసాల ఆర్థికంగా దెబ్బ తిన్నారు..

    ఘంటసాల గారు సొంతవూరు అనే సినిమా చేశారు. రామారావు లాంటి ఫ్రీగా చేశారు. ఆ సినిమా వల్ల ఆర్థికంగా దారుణంగా దెబ్బ తిన్నారు. ఆయన చాలా మంది మిస్ యూజ్ చేశారమో. ఆ తర్వాత ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మళ్లీ రెండు, మూడు సినిమాలు చేశారు. అవి కూడా నష్టాలు తీసుకురావడంతో మళ్ల కథ మొదటికి వచ్చింది. దాంతో ఆయన ఆర్థికంగా చితికిపోయారు.

    ప్రభుత్వ ఉద్యోగులు ఏం పొడిచారని..

    ప్రభుత్వ ఉద్యోగులు ఏం పొడిచారని..

    చిత్ర పరిశ్రమ అనేది గ్యారెంటీ లేనిది. ప్రభుత్వ ఉద్యోగులైన నా స్నేహితులతో పోల్చుకంటే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైరైనా వాళ్లు నెలకు రూ.60 వేల పెన్షన్ తీసుకొంటున్నారు. వాళ్లు సమాజానికి పొడిచింది ఏమీ లేదు. ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లి టైంపాస్ చేసి వచ్చేవారు. అలాంటి వారు నా కంటే వారు మెరుగైన జీవితాన్ని ఇలా ఇబ్బంది లేకుండా గడుపుతున్నారు. వారితో పోల్చుకుంటే నేను బాగుపడింది ఏమిలేదు. ఇప్పటికీ వేషాల కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి ఉంది.

    తాగుడుకు అలవాటు పడి..

    తాగుడుకు అలవాటు పడి..

    నా కంటే ముందు పరిశ్రమలో ఉన్న వాళ్లు జీవితపు చివరి దశలో డబ్బులు లేక నరకయాతన అనుభవించారు. అందంతా వారి స్వయంకృపారాధంతో తాగుడు అలవాటుపడి, రేసులు ఆడి కొందరు, రెండో పెళ్లి చేసుకొని మరికొందరు జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.

    నాగభూషణం పరిస్థితి చూసి..

    నాగభూషణం పరిస్థితి చూసి..

    సీనియర్ నటులు నాగభూషణం ఆస్తుల గురించి నాకు తెలుసు. చివరి దశలో డబ్బులు లేక హైదరాబాద్ గాంధీనగర్‌లో ఔట్‌హౌస్‌లో భార్యతో గడిపాడు. ఆయన చూస్తే చాలా జాలి వేస్తుంది. పిల్లల పెంపకం సరిగా లేని కారణంగా హరినాథ్, ఆర్ నాగేశ్వర్ రావు, ఎస్వీ రంగారావు, రేలంగి పిల్లలు చెడు అలవాట్లకు గురై వారిని దెబ్బ తీశారు. ఎస్వీ రంగారావు కుమారుడైతే ఆయన తాగి వదిలేసిన మందు తాగేవాడు. వంద, రెండొందలు ఇవ్వమని ప్రాధేయపడేవారు. రేలంగి కుమారుడు చాలా సంపాదించాడు. ఆయన కొడుకు ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే కెరీర్ బాగా ఉన్నప్పుడే ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చంద్రమోహన్ అన్నారు.

    నా బిడ్డలను పరిశ్రమకు ..

    నా బిడ్డలను పరిశ్రమకు ..

    లక్కీగా నాకు ఇద్దరు ఆడపిల్లలు. చాలా అందంగా ఉంటారు. కానీ వారిపై సినిమా ప్రభావం పడనివ్వకుండా చూసుకొన్నాను. నా పిల్లలకు సినిమా అవకాశాలు వచ్చినా నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే చదువు వదిలిపెట్టి సినిమాల్లో నటిస్తే జీవితం పాడైపోతుందని నేను వద్దనుకొన్నాను.

    వారి పిల్లల వల్లే..

    వారి పిల్లల వల్లే..

    చాలా సీనియర్ నటులు ఆర్థికంగా ఇబ్బందికి గురికావడానికి వారి వారి పిల్లలే. రేలంగి, రంగారావు, నాగభూషణం లాంటి నటుల పిల్లలు చెడు అలవాట్లు అలవాటు పడటం వల్లే వారు ఆర్థికంగా చితికిపోయారు. చివరిదశలో నరకం అనుభవించారు అని చంద్రమోహన్ చెప్పారు.

    విశ్వనాథ్‌తో ఇబ్బంది..

    విశ్వనాథ్‌తో ఇబ్బంది..

    నాకు చాలా ఇష్టమైన దర్శకుడు బాపు. తొలినాళ్లలో బాపు తన సొంత కొడుకులా చూసుకొన్నారు. బాగా మెలుకవలు నేర్పించారు. విశ్వనాథ్‌తో పనిచేయడం నాకు ఇబ్బందిగా ఉండేది. ఆయన చెప్పిన ప్రకారమే నటించాల్సి ఉండేది. ఆయనను ఇమిటేడ్ చేయాల్సి వచ్చేది. ఆయన షాట్ ఓకే చేస్తే చాలురా అనే ఫీలింగ్ ఉండేది. కానీ విశ్వనాథ్ గొప్ప దర్శకుడు. ఆయనకు ఎవరు సాటి రారు అని ఆయన అన్నారు.

    English summary
    Senior Actress Chandra Mohan reveals his life experieces. He said some senior actors lead miserable life in end years because of their sons behaviour. He said Working with Director Vishwanth is toughest job in his career.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X