సినిమాకి టబు అందాలే దెబ్బ కొట్టాయి
'ఇదీ సంగతి' లో కథంతా మనిషిలోని స్వార్థం చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా టబు మీదే దృష్టిపెట్టారు. చెప్పదల్చుకున్న విషయం గాడి తప్పింది. అదే దెబ్బ కొట్టింది అంటున్నారు దర్శకుడు చంద్ర సిద్దార్ద. ఆయన తాజా చిత్రం అందరి బంధువయా త్వరలో రిలీజ్ కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఇదీ సంగతి' చిత్రాన్ని, అది పరాజయమైన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే తెలుగులో మంచి సినిమాలు తీసే నిర్మాతలు రావటం లేదంటూ...'కొద్ది మంది ఉన్నారంతే..' అని ముసుగు వేసుకుని మొహమాటం కొద్దీ మాట్లాడలేను. నిజం చెప్పాలంటే అలాంటి నిర్మాతలు మనకు లేరు. మనమంతా కొన్ని సూత్రాలకు లోబడి కథలు రాసుకుంటున్నాం. అవే తీస్తున్నాం. ఇంకో దారి లేక ప్రేక్షకులు అవే చూస్తున్నారు. మంచి కథలు సిద్ధం చేస్తే 'ఇలాంటివి ఎవరు చూస్తారోయ్..' అనేస్తారు. అంటే తప్పు ప్రేక్షకులదా? కాదే! మంచి సినిమాలు తీస్తే తప్పకుండా జనం చూస్తారు. పెద్ద నిర్మాతలకు పెద్ద హీరోలు, స్టార్ దర్శకులే కావాలి. అలాంటప్పుడు విలువలతో కూడిన కథలు ఓడిపోతున్నాయి అన్నారు.


Click it and Unblock the Notifications











