ఒకే స్టోరీ లైన్ తో మణిరత్నం, 'ఆ నలుగురు' దర్శకుడు!?
రామాయణం ఆధారంగా రావణ్ చిత్రం తీసిన మణిరత్నం తాజాగా మహాభారతం ఆధారంగా ఓ చిత్రం రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులోని ద్రౌపది పాత్ర ప్రధానంగా..ఆమె ఐదురుగు భర్తలతో మెలిగిన విధానాన్ని బేస్ చేసుకుని ఓ స్త్రీ జీవితంలో ఐదుగురు భర్తలు అనే పాయింట్ ని తీసుకుని మణి ఓ కాంటంపరెరీ కథను అందించాలని ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సబ్జెక్టుతోనే ఆ ఐదుగురు అనే సబ్జెక్టుని చంద్ర సిద్దార్ధ రూపొందించారని తెలుస్తోంది. అయితే మణి రత్నం కూడా ఇలాంటి సబ్జెక్టునే వస్తున్నారని తెలిసి ఆపుదామనుకున్నారు. కానీ అది ఆయన విజన్, ఇది నీ విజన్, ఇద్దరి పాయింట్ ఒకటే అయినా కథ వేరు కావచ్చుగా అని శ్రేయాభిలాషులు ధైర్యం చెప్పటంతో త్వరలోనే ఈ సబ్జెక్టుని ఆయన తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక చంద్ర సిద్దార్ధ ఇంతకుముందు శర్వానంద్, పద్మప్రియ కాంబినేషన్ లో అందరి బంధువయా అనే చిత్రం రూపొందించారు. అదీ భాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది.


Click it and Unblock the Notifications











