డైరెక్టర్ బుగ్గపై మహేష్ బాబు ముద్దు.. సోషల్ మీడియాలో వైరల్.. ఏం జరిగిందంటే!
ప్రతీ ఒక్కరికీ లైఫ్‌లో కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. వాటిని ఎప్పటికీ మరిచిపోకుండా స్మరించుకొని మరీ సంబరపడుతుంటారంతా. అలాంటి ఓ బెస్ట్ మూమెంట్ నా లైఫ్‌లో చోటు చేసుకుందని అంటున్నారు డైరెక్టర్ వంశీ పైడిపెల్లి. సోషల్ మీడియా వేదికగా తన లైఫ్‌లో ఇదే బెస్ట్ మూమెంట్ అని పేర్కొంటూ మహేష్ బాబు తనను కిస్ చేస్తున్న ఫోటో షేర్ చేశారు వంశీ. ఇందులో వంశీ బుగ్గలపై ఎంతో ప్రేమగా సూపర్ స్టార్ మహేష్ బాబు కిస్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పిక్ చూసిన మహేష్ అభిమానులు ఖుషీ అవుతూ ఇద్దరి ప్రేమను స్వాగతిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ సినిమాగా 'మహర్షి' సినిమా తెరకెక్కింది. హై టెక్నీకల్ వాల్యూస్‌తో వంశీ పైడిపెల్లి ఈ సినిమాను రూపొందించారు. మే 9వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ ఇప్పటికే 50 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. దీంతో ఆనందోత్సాహంలో మునిగితేలుతున్న చిత్ర యూనిట్ గ్రాండ్‌గా సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా నిర్వహించారు.
సామాజిక అంశాలతో రూపొందించబడి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది మహర్షి సినిమా. తన కెరీర్‌లో 25వ సినిమా కావడం పైగా రైతు నేపథ్యంలో తెరకెక్కడం మూలంగా ఈ విజయాన్ని మహేష్ ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నారు. అందుకేనేమో తన డైరెక్టర్ వంశీకి ఆప్యాయంగా బుగ్గపై కిస్ చేశారు మహేష్ బాబు. దీంతో తెగ సంబరపడిపోతూ ఈ పిక్‌ని అందరితో పంచుకున్న వంశీ పైడిపెల్లి 'నా లైఫ్ లో బెస్ట్ మూమెంట్.. ఇంతకంటే ఇంకేం అడగగలను' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
మరోవైపు మహర్షి చిత్రంలో మహేష్, పూజా హెగ్డే జోడీ థియేటర్లను హోరెత్తిస్తోంది. అల్లరి నరేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా కాలం తరువాత మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చూశామని అంటున్నారు అన్ని వర్గాల ప్రేక్షకులు. ప్రస్తుతం మహర్షి జోరు చూస్తుంటే ఈ వీకెండ్ కల్లా భారీ కలెక్షన్స్ రాబట్టొచ్చని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత మహేష్ తన 26వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











