Bheemla Nayak: సంచలనంగా చంద్రబాబు, లోకేష్ ట్వీట్స్.. ముందు వాళ్లను రక్షించాలంటూ ఘాటుగా!
భీమ్లా నాయక్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుంది. దీనికి కారణం ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలిసి నటించడమే. భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం ఆరంభం నుంచే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో బిజినెస్‌ను జరుపుకుని.. శుక్రవారమే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' మూవీకి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కష్టమే వచ్చింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఈ చిత్రంపై ట్వీట్స్ చేశారు. ఆ సంగతులు మీకోసం!

క్రేజీ కాంబోలో భీమ్లా నాయక్
పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రత్యర్థులుగా రూపొందిన భారీ చిత్రమే 'భీమ్లా నాయక్'. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి దర్శకత్వ పర్యవేక్షణతో పాటు డైలాగ్‌లను అందించాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చాడు. ఇక, ఈ మూవీలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ ఇందులో నటించారు.

సూపర్ టాక్.. పాజిటివ్ రివ్యూ
'భీమ్లా నాయక్' మూవీ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన మాస్ మూవీ. ఎన్నో అంచనాలతో ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇందులో పవన్ విశ్వరూపం చూపించాడని, రానా ఇరగదీసేశాడని అంటున్నారు. రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అవుతోంది.

ఏపీలో రూల్స్.. మూవీకి దెబ్బ
కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవో నెంబర్ 35న జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఇప్పుడు ఎత్తివేస్తారని అంతా అనుకున్నా.. భీమ్లా నాయక్ విడుదలకు ముందు మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అలాగే, బెన్‌ఫిట్ షోలకు అనుమతి లేకపోవడంతో పాటు టికెట్ రేట్లు పెంచకుండా చూసేందుకు అధికారులతో తనిఖీలు కూడా చేయిస్తున్నారు.

భీమ్లా నాయక్ కోసం లోకేష్
'భీమ్లా నాయక్' విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై నారా లోకేష్ మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో 'భీమ్లా నాయక్‌కు మంచి స్పందన వస్తోంది. దీన్ని చూడాలని అనుకుంటున్నా. ప్రతి పరిశ్రమను మూసేస్తూ జగన్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాడు. సినీ పరిశ్రమ దీనికి మినహాయింపు కాదు. అన్ని కుట్రలను అధిగమించి సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉగ్రవాదమే ఇది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం వైఎస్ జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తోంది' అని అన్నారు.

భారతీ సిమెంట్‌ను లాగుతూ
చంద్రబాబు మరో ట్వీట్‌లో భారతీ సిమెంట్ రేట్లను ప్రస్తావిస్తూ 'వ్యక్తులను టార్గెట్‌గా పెట్టుకుని వ్యవస్థలను నాశనం చేస్తున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. భారతీ సిమెంట్ రేటుపై లేని నియంత్రణ భీమ్లా నాయక్ సినిమాపై ఎందుకు? ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాను తెలుగు రాష్ట్రంలో వేధిస్తున్న జగన్ తన మూర్ఖపు వైఖరి వీడాలి' అని డిమాండ్ చేశారు.

చంద్రబాబు డిమాండ్ చేస్తూ
ఇంకో ట్వీట్‌లో చంద్రబాబు 'రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి... థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే... ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్‌పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది.. నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను' అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











