ఫోటోలు: హరికృష్ణ పెద్ద కర్మ.. ఎన్టీఆర్‌తో చంద్రబాబు!
Recommended Video

నందమూరి హరికృష్ణ పెద్ద కర్మ నేడు హైదరాబాద్ లోని జలవిహార్ లో జరిగింది. ఆగష్టు 29 న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి నెల్లూరు ప్రయాణిస్తూ నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద హరికృష్ణ వాహనం ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న వాహనం తిరగబడడంతో హరికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. హరికృష్ణ తనయులు నేడు పెద్ద కర్మ నిర్వహించారు.

హాజరైన ప్రముఖులు
హరికృష్ణ పెద్ద కర్మ కార్యక్రమానికి నందమూరి కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. టిడిపి నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరై హరికృష్ణ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
పెద్ద కర్మ సందర్భంగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దగ్గరుండి జరిపించారు. తన సోదరుడి పెద్ద కర్మకు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. హరికృష్ణ అంత్యక్రియల సందర్భంగా చంద్రబాబు, బాలయ్య కలసి హరికృష్ణ పాడె మోసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు ఆప్యాయంగా
ఈ సందర్భంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని దగ్గరకు తీసుకుని చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న వారిద్దరికీ భరోసా ఇచ్చారు.

వివాహం కోసం
హరికృష్ణ ఆకస్మిక మరణం సినీ రాజకీయా వర్గాలని షాక్ కి గురిచేసింది. వివాహం కోసం బయలుదేరిన హరికృష్ణ ఇలా ప్రమాదానికి గురై మరణించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైంది.


Click it and Unblock the Notifications











