మొత్తానికి ఎన్టీఆర్ నెగ్గాడు

వాస్తవానికి యువగర్జన సభకు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు కావడానికి, వల్లభనేనికి బాబు సీటు నిరాకరించడమేనని అందరూ చెప్పుకుంటున్నారు. దానికి అణుగుణంగానే అలక చెందిన జూ. ఎన్టీఆర్ షూటింగ్ పేరుతో గర్జనకు గైర్హాజరు కావడంతో టిడిపి శ్రేణుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఇటీవల జ్వరంతో బాధపడుతున్న జూనియర్‌కు బాబు ఫోన్ చేయడంతో వాతావరణం తేలికైనట్లు తెలుస్తున్నది. దాంతో చిరంజీవి,పవన్ కళ్యాణ్ ల స్టార్ ఇమేజ్ పవర్ ని ఎదుర్కొనేందుకు తెలుగు దేశం తరుపున బాలయ్య తో పాటు ఎన్టీఆర్ నడుంకడతారనేది సుస్పష్టం. దాంతో ఎక్కడెక్కడి ఎన్టీఆర్ అభిమానులకు అప్పుడే ఈ వార్త చేరి ఆనందం వ్యక్తం అవుతోంది. తమ అభిమాన కధా నాయుకుడుకి అండగా నిలబడటానికి వారు ప్రిపేర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











