ఎన్టీఆర్‌కు వెన్నుపోటు... అంశం చుట్టూ ‘చంద్రబాబు బయోపిక్’
టాలీవుడ్లో వరుస బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉండగా.... వీటితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. 'చంద్రోదయం' అనే టైటిల్‍తో ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇందులో చంద్రబాబుతో పాటు ఆయన మామ, దివంగత నేత ఎన్టీ రామారావు పాత్రలు ప్రముఖంగా చూపించబోతున్నారు. దర్శకుడు పసలపూడి వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రస్తుతం ఎన్టీఆర్ పాత్రపై పలు సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

చంద్రోదయం
సినిమా గురించి దర్శకుడు వెంకటరమణ, నిర్మాత గండికోట రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ... నారావారిపల్లెలో పాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది, చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని తెలిపారు.

చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు
చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు తెదేపాకు ఆయన వెన్నెముక అనే విషయాన్ని చాటి చెప్పడమే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశ్యమని, ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు, టీడీపీ పార్టీలోకి ఎలా వచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అనే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని దర్శక నిర్మాతలు తెలిపారు.

చంద్రబాబుగా
చంద్రబాబుగా కర్ణాటక నటుడు అభిషేక్, ఎన్టీఆర్‌గా భాస్కర్.. వీరితోపాటు మౌనికాచౌదరి, పల్లవి శ్రేష్ఠ నటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?
వచ్చే నెలలో ఆడియో రిలీజ్ చేసి అక్టోబరు మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పొలిటికల్‌గా తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకు సపోర్ట్ అవుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











