బాలయ్య కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన ఆ భావ ఎవరు..!?
బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ప్రారంభవుతుందని, పరుచూరి మురళీ దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరెకెక్కనుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'సింహా" తో సూపర్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణ, ఈ చిత్రంతోనూ సూపర్ హిట్ కొట్టాలని అభిలషించారు చంద్రబాబు.
తాను ఓపెనింగ్ కి విచ్చేస్తే సినిమా టూ హండ్రెడ్ డేస్ ఆడటం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేయగా, మంచి సబ్జెక్ట్ వున్న కథని, తప్పక విజయం సాధిస్తుందని బాలకృష్ణ అన్నారు. బాలయ్య కోసం ఆయన స్టామినాకి తగ్గట్టుగా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తయారు చేశామనీ, సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమనీ, కమర్షియల్ అంశాలతో పాటు, మంచి మెసేజ్ కూడా తమ చిత్రం ద్వారా ప్రేక్షకులకు అందిస్తామని అంటున్నాడు దర్శకుడు పరుచూరి మురళి మరియు నిర్మాత యం ఎల్ కుమార్ చౌదరి మరియు కళ్యాణ్ మాలిక్. ఫేమస్ బిజినెస్ మాన్ రఘు స్విచ్ ఆన్ చేయగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఫస్ట్ షాట్ ను డైరెక్ట్ చేశారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు తదితరులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











