Jr NTR fan Death రంగంలోకి చంద్రబాబు.. వాళ్లపైనే అనుమానం అంటూ!

జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం పూటకో మలుపు తిరుగుతుంది. మొదట ఇది ఆత్మహత్య అని అనుకున్నా.. ఆ తర్వాత అతడిని హత్య చేశారంటూ ప్రచారం మొదలైంది. దీంతో ఇది అనుమానాస్పద మృతిగా మారింది. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. ముఖ్యంగా ఈ ఘటనకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులకు సంబంధం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శ్యామ్ మృతిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. అందులో ఏం రాశారంటే!

ఇంట్లో ఉరి.. గాయాలతో:టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన శ్యామ్ తూర్పుగోదావరి జిల్లా చింతలూరు గ్రామంలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు. ఆ సమయంలో అతడు ఉరి వేసుకుని ఉండగా.. చేతిపై బలమైన కత్తిగాట్లు కూడా ఉన్నాయి. అలాగే, శరీరంపై కొన్ని గాయాలు కూడా కనిపించాయి. అంతేకాదు, అతడి జేబులో గంజాయి కూడా కనిపించింది.

Chandrababu Naidu demands AP Govt to justice for NTR Fan shyam Family

ఫ్యాన్స్ ఆరోపణలతోనే:శ్యామ్ మృతి తర్వాత అతడిది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ ఎన్టీఆర్ అభిమానులు సరికొత్త వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. ఒకవేళ అతడు ఉరి వేసుకుంటే మెడపై గాయం ఎందుకు కాలేదు? చేతిని కోసుకున్న వాడు ఉరి ఎందుకు వేసుకున్నాడు? గంజాయి తీసుకుంటే ఉరి వేసుకునే స్పృహ ఉంటుందా? అంటూ ఎన్నో రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu Naidu demands AP Govt to justice for NTR Fan shyam Family

న్యాయం చేయాలంటూ:జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ అనుమానాస్పద మృతి ఘటనపై ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో అతడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

Chandrababu Naidu demands AP Govt to justice for NTR Fan shyam Family

చంద్రబాబు మద్దతు:ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్యామ్ మృతిపై రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై నారా లోకేష్ ట్వీట్ చేయగా.. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా శ్యామ్ మరణంపై ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మద్దతు తెలపడంతో పాటు శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

న్యాయం జరగాలని:చంద్రబాబు ట్వీట్‌లో 'తూర్పుగోదావరి జిల్లా చింతలూరులో శ్యామ్ విషాదకరమైన, అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అతడి మృతికి సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషాదకర సంఘటనపై వీలైనంత త్వరగా సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.

Chandrababu Naidu demands AP Govt to justice for NTR Fan shyam Family

వైసీపీ వాళ్లు ఉన్నా:ఇదే ట్వీట్‌లో చంద్రబాబు 'శ్యామ్ మృతి వెనుక అధికార వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ వారి ప్రమేయం ఉన్నా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. శ్యామ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూసే బాధ్యతను తీసుకుంటున్నాము' అని చెప్పారు. ఆయన చేసిన ఈ ట్వీట్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకూలంగా రిప్లైలు ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X