twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోడీకి ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చూపించాలి.. బహిరంగ సభలో చంద్రబాబు!

    |

    నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందించబడింది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు చిత్రాలు దారుణంగా నిరాశపరిచాయి. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రానికి ఇలాంటి రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తెలుగు దేశం పార్టీ వర్గాలని కూడా నిరాశపరిచింది. తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    బాలయ్య ఎంతో ఇష్టపడి

    బాలయ్య ఎంతో ఇష్టపడి

    బాలకృష్ణ ఎంతో ఇష్టపడి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి బాలయ్య నిర్మాత కూడా. తన తండ్రి చరిత్ర కాబట్టి బాలయ్య ఖర్చుకు వెనకాడకుండా ఎన్టీఆర్ బయోపిక్ లోని రెండు భాగాలని నిర్మించారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం అంచనాలని అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచింది. బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. ఫిబ్రవరి 22న విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు పరిస్థితి కూడా అంతే. ఎన్టీఆర్ బయోపిక్ పై అనేక రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి.

     చివరి మజిలి లేదు

    చివరి మజిలి లేదు

    ఎన్టీఆర్ చరిత్రని రెండు భాగాలుగా తెరకెక్కించినా అందులో చివరి మజిలీ చూపించలేదు. లక్ష్మి పార్వతి, వైస్రాయ్ ఘటన లాంటి అంశాలని చూపించలేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక ఇందులో రానా నటించిన చంద్రబాబు పాత్రని కూడా హైలైట్ చేశారు. బాలయ్య, రానా క్రేజ్ కూడా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని కాపాడలేకపోయింది.

     నేనెంటో తెలియాలంటే

    నేనెంటో తెలియాలంటే

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా కొమడూరు బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం గురించి ప్రస్తావించారు. ప్రధాని నరేంద్రమోడీని విమర్శిస్తూ.. మోడీగారు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా చూస్తే అర్థం అవుతుంది ఈ చంద్రబాబు నాయుడు అంటే ఏమిటో అని అన్నారు. 80 దశకంలోనే కేంద్రంపై పోరాటం చేసి గెలిచినా ఘనత తమది అని చంద్రబాబు అన్నారు.

    ఇందిరా గాంధీపై

    ఇందిరా గాంధీపై

    ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రంలో.. ఎన్టీఆర్ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీపై పోరాటం చేసే సన్నివేశాలని చూపించారు. ఈ పోరాటంలో అప్పుడప్పుడే రాజకీయాల్లో ఎదుగుతున్న చంద్రబాబు కీలక పాత్ర పోషించినట్లు చూపించారు. చంద్రబాబు పాత్రలో రానా మంచి నటన కనబరిచాడు.

    English summary
    Chandrababu Naidu interesting comments on NTR Mahanayakudu movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X