ఇదీ బాలకృష్ణ టూరు తీరు!!

By Staff

Balakrishna
వాస్తవానికి డిసెంబరు మూడో వారం నుంచి రాయలసీమలో రోడ్‌షోలు నిర్వహించాలని బాలయ్య తొలుత నిర్ణయించారు.అయితే హైకోర్టు రోడ్‌షోలపై స్టే విధించడంతో తన ప్రచార కార్యక్రమాలు ఏవిధంగా ఉండాలన్న దానిపై ఆయన డైలమాలో ఉన్నారు.అయితే చంద్ర బాబు మాత్రం రోడ్‌షోలపై స్టే విధించిన నేపథ్యంలో ఇక బహిరంగ సభలు, ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సభల రూపంలో ప్రచార కార్యక్రమం రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారని సమాచారం. దానికి బాలయ్య కూడా సరే అన్నారని పార్టీ వర్గాల భొగట్టా. ఈ విషయం పై పూర్తి అవగాహన కోసం త్వరలోనే చంద్రబాబుతో చర్చ జరుపుతారని తెలుస్తోంది. హరికృష్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఇక మహదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ నిమిత్తం విదేశాలకు వెళ్లిన నందమూరి బాలకృష్ణ మంగళవారం రాష్ట్రానికి తిరిగిరానున్నారు. వచ్చాక రెండు రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత బాబ్లీపై పోరాటం అనంతరం ఢిల్లీ నుంచి చంద్ర బాబు తిరిగొచ్చాక ఆయనతో భేటీ అవుతారు. బాబు, బాలయ్య భేటీలో దీనికి తుదిరూపునివ్వనున్నారు. ఎన్నికలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదాపడే అవకాశాలుండటంతో డిసెంబరు మూడో వారం కాకుండా.. మరికొంత ఆలస్యంగా బాలయ్య తన ప్రచారాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈసారి టూరులో మాత్రం అభిమానులును మాత్రమే కాక సామాన్య ప్రజానీకాన్ని పూర్తి స్ధాయిలో ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X